
మూడు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను శనివారం బిజెపి నియమించింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఏపీ బీజేపీ నేత వై సత్యకుమార్ అండమాన్ నికోబార్ ఇన్‌ఛార్జీగా నియమితులయ్యారు. తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జీగా పొంగులేటి సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు.
వీరిలో బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేను బిహార్ ఎన్నికల ఇన్‌చార్జ్జ్‌గా నియమించారు. తావ్డే బిహార్‌లో బీజేపీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. యూపీ ఎన్నికల ఇన్‌చార్జ్జ్‌గా పార్టీ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాను, జాతీయ జనరల్ సెక్రటరీ దుశ్యంత్ కుమార్ గౌతమ్‌ను ఉత్తరాఖండ్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్జ్‌గా ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ మహేంద్ర సింగ్ నియమితులయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్‌ను కేరళ ఇంఛార్జ్‌గా నియమించింది. అరుణాచల్ ప్రదేశ్- అశోక్ సింఘాల్, బిహార్- వినోద్ తావ్డే, దీపక్ ప్రకాష్, చండీగఢ్- విజయ్ భాయ్ రుపాణి, డయ్యూ డమన్- పూర్ణేష్ మోదీ, దుష్యంత్ పటేల్, గోవా- ఆశీష్ సూద్, హర్యానా- బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్- శ్రీకాంత్ శర్మ, సంజయ్ టండన్, జమ్మూ కాశ్మీర్- తరుణ్ ఛుగ్, ఆశీష్ సూద్, జార్ఖండ్- లక్ష్మీకాంత్ బాజ్‌పేయి నియమితులయ్యారు.
More Stories
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా