కాళేశ్వరంపై దర్యాప్తుకు సీబీఐ సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్టు హై కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పష్టం చేసిం ది. హైకోర్టు ఆదేశాలిచ్చినా ,లేదా రాష్ట్ర ప్రభు త్వం కోరినా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది. 
 
అయితే దర్యాప్తునకు అ వసరమైన వసతులు ఆర్థిక వనరులు కల్పించాల్సివుంటుందని సిబిఐ కోర్టుకు తెలిపింది. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు, 4గురు ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని చెప్పారు. సీబీఐ అధికారుల కౌంటర్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణ ఆరోజుకు వాయిదా వేసింది.

కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సీబీఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సీబీఐ హైదరాబాద్‌ విభాగం హెడ్‌, ఐపీఎస్‌ అధికారి డీ కళ్యాణ్‌ చక్రవర్తి తన కౌంటర్‌ దాఖలు చేస్తూ ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టుకు తెలిపారు. 

కాళేశ్వరం ఎతిపోతల సాగునీటి పధకంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైన నేరుగా కల్పించుకుని దర్యాప్తు చేయలేమని తెలిపారు. ఈ అంశంలో సిబిఐకి పరిమితులు ఉన్నట్టు తెలిపారు.  అంతే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అవరమైన రుణ సదుపాయం కల్పించి నిధులు అందజేసిన ఆర్ధిక సంస్థలనుంచిగాని, బ్యాంకుల నుంచిగాని సిబిఐకి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. 

అయితే ఇదే అంశపై పిటీషనర్ దాఖలు చేసిన ఫిర్యాదుపైన పరిశీలన జరుగుతున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందని చెప్పారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల పాత్రవుంటే విచారణకు అవకాశాలు ఉంటాయని, అదే రాష్ట్ర ప్రభుత్వ ఆధికారుల ప్రమేయం ఉంటే మాత్రం నేరుగా జోక్యం చేసకునే అవకాశం సిబిఐకి ఉండదని వివరించా రు.

ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకంలో అంతర్భాగంగావుంటూ అత్యంత కీలకంగావున్న మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటనలో కారణాలు వెలికి తీసేందకు సిట్టింగ్ జడ్జిచేత న్యాయవిచారణ జరిపిస్తామని గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ఓ జడ్జిని కేటాయించాలని కోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాసారు. 
 
 మరోవంక,ఈ కేసుకు ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మేడిగడ్డ అంశాన్ని సమగ్రంగా లోతుగా దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ విభాగం కూడా క్షేత్ర స్థాయిలో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించింది. త్వరలోనే మధ్యంతర నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసే దిశగా అడుగులు వేస్తోంది.