అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో బజ్ బాల్ ఆటను పరిచయం చేసిన ఇంగ్లండ్ జట్టు.. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో తడబడుతుంటే, రంజీ ట్రోఫీలో మాత్రం హైదరాబాద్ దుమ్మురేపుతుంది. ప్లేట్ డివిజన్ లో ఆడుతున్న హైదరాబాద్ వరుసగా రెండో విజయం పై కన్నేసింది. ఒక్కరోజులోనే 529 పరుగుల భారీ స్కోరు చేయడమే కాదు(48 ఓవర్లలోనే) ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో వేగవంతమైన తొలి ట్రిపుల్ సెంచరీ రికార్డు కూడా వచ్చి చేరింది.
రంజీ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. 1772లో మొదలైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 150 బంతుల్లోపే ఓ బ్యాటర్ ట్రిపుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అతని దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు విలవిల్లాడారు.
మొదట అరుణాచల్ ప్రదేశ్ ను కేవలం 172 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్ ఆ తర్వాత తన్మయ్ ఊచకోతతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 48 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 529 పరుగుల భారీ స్కోరు చేసింది. తన్మయ్ అగర్వాల్ 160 బంతుల్లోనే 33 ఫోర్లు, 21 సిక్స్ లతో 323 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. మరో ఓపెనర్ రాహుల్ సింగ్ గహ్లోత్ కూడా కేవలం 105 బంతుల్లో 185 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 26 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు కేవలం 40.2 ఓవర్లలోనే 449 రన్స్ జోడించడం విశేషం.
ఇక రంజీ ట్రోఫీలో ఒకే రోజులో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ తన్మయ్ అగర్వాలే. నిమిషాల పరంగా చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండో అత్యంత వేగంగా నమోదైన ట్రిపుల్ సెంచరీగా ఇది నిలిచింది.అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గానూ తన్మయ్ నిలిచాడు. తన్మయ్ కేవలం 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. గతంలో రవిశాస్త్రి 123 బంతుల్లో కొట్టిన డబుల్ సెంచరీ రికార్డును తన్మయ్ బ్రేక్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఓవరాల్ గా ఇది రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం విశేషం.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన