ఎవరీ సీకే నాయుడు? తెలుగునాడుతో సంబంధమేంటి?

కటారీ కనకయ్య నాయుడు.  భారత క్రికెట్ చరిత్రలో మొదటి రోజుల్లో మన టెస్టు జట్టుకు మొదటి కెప్టెన్ సీకే నాయుడు కావడం విశేషం. 62 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో ఆడి తన సత్తా ఏంటో అందరికి తెలియజేశాడు. కాగా బీసీసీఐ మంగళవారం వార్షిక అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది.  లెజెండరీ క్రికెటర్లు ఫరూక్ ఇంజనీర్, మాజీ కోచ్ రవిశాస్త్రిలకు సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు దక్కింది.

సీకే నాయుడు 1895 అక్టోబర్ 31న నాగ్‌పుర్‌లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. నాగ్‌పుర్‌లోనే పెరిగిన ఈయన పాఠశాల రోజులనుంచే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ చూపేవారు. 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగారు.

మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టారు సీకే నాయుడు. అలా మెుదలైన ఆయన.. ప్రస్థానం.. చివరి వరకూ సాగింది. ఆరు దశాబ్దాలపాటు “ఫస్ట్ క్లాస్ క్రికెట్” ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సీకే నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62వ ఏట చివరి మ్యాచ్ ఆడిన సీకే నాయుడు మ్యాచ్‌లో 52 పరుగులు చేశారు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్‌గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించారు.

సీకే నాయుడు పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వారు. వాళ్ల కుటుంబం ఎప్పుడో హైదరాబాద్ లో స్థిరపడింది. నారాయణస్వామి నాయుడు తాత నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసేవారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్‌కు మారింది. సీకే కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్ కావడం విశేషం.

భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సీకే నాయుడు తన ఆఖరు మ్యాచ్ 1963లో ఆడారు. క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న క్రికెటర్ సీకే నాయుడు మాత్రమే. ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సీకే నాయుడు ఒకరు. భారత జట్టుకి ఆడినవారిలో “విజ్డెన్” పత్రిక “క్రికెటర్ ఆఫ్ ది ఇయర్”గా 1933లో ఎంపికైన మొదటి వ్యక్తి సీకే నాయుడే కావడం గమనార్హం.

1955లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం పురస్కారం అందుకున్నారు. క్రికెట్ కు అతను చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ.. సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ పేరిట అవార్డు ప్రవేశపెట్టింది.