రామ్ లల్లా కోసం నెహ్రూనే ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్యెల్యే

వికాస్ పాఠక్
 
అయోధ్యలో వందల రామమందిరం కల నెరవేరేందుకు స్వతంత్రం వచ్చిన్నప్పటి నుండి ఎందరెందరో ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డారు. బలమైన ప్రభుత్వాలను, నేతలను ధిక్కరించి తమ `రామభక్తి’ని చాటుకున్నారు.  దేశంలో తిరుగులేని నేతగా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఉన్న సమయంలో, కాంగ్రెస్ పార్టీలో ఎమ్యెల్యేగా ఉంటూ ఆయన ఆదేశాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగిన అప్పటి ఫేజియాబాద్ ఎమ్యెల్యే బాబా రాఘవదాస్ అటువంటి వారిలో అగ్రగణ్యులలో ఒకరుగా చెప్పవచ్చు.
 
డిసెంబర్ 22-23, 1949 రాత్రి బాబ్రీ కట్టడంలో ప్రత్యక్షమైన రామ్ లల్లా విగ్రహం పట్ల ఆగ్రహంతో ఊగిపోతూ దానిని తొలగించాలని  నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దానిని తొలగించాలనిఆదేశించారు. స్థానిక అధికారులతో పాటు తమ పార్టీ ఎమ్యెల్యే స్వయంగా దిక్కరించడంతో దేశ విభజన, అల్లర్ల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన దేశంలో నెహ్రూ నిస్సహాయంగా ఉండిపోవాల్సివచ్చింది.
 
ప్రధాన మంత్రి ఆదేశాలకు ధిక్కారస్వరం అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ కెకె నాయర్, నగర మేజిస్ట్రేట్ గురుదత్ సింగ్ ల నుండి మాత్రమే కాకుండా, ఫైజాబాద్‌లోని కాంగ్రెస్ నుండి కూడా వచ్చింది. ఫైజాబాద్‌లోని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబా రాఘవ్ దాస్ విగ్రహాన్ని తొలగించే ఏ చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. అలా జరిగితే రాజీనామా చేస్తానని కూడా బెదిరించారు. `ది డెమోలిషన్ అండ్ ది వెర్డిక్ట్’ అనే తన పుస్తకంలో జర్నలిస్ట్ నీలాంజన్ ముఖోపాధ్యాయ ఇలా వ్రాశాడు:
 
 “1950లో నెహ్రూ ఆదేశాల మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై చర్య తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నప్పుడు రాఘవ్ దాస్ విగ్రహం తీసివేస్తే  అసెంబ్లీకి, పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించాడు.” ఆ  ఎమ్మెల్యే 1948 ఉప ఎన్నికలో ఫైజాబాద్ నుండి గెలుపొందాడు.సిట్టింగ్ ఎమ్మెల్యే, సోషలిస్ట్ అగ్రనేత ఆచార్య నరేంద్ర దేవ్‌ను దాదాపు 1,300 ఓట్ల తేడాతో ఓడించాడు.
 
నరేంద్ర దేవ్ ప్రత్యేక సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ నుండి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రత్యేక సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నుండి వాకౌట్ చేసిన 13 మంది ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఉన్నారు.
 
రాఘవ్ దాస్‌ను యూపీ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ స్వయంగా ఉప ఎన్నికకు ఎంపిక చేశారు. హేతువాది నరేంద్ర దేవ్‌కు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపే రాఘవ్ దాస్ సరైన జోడిగా అందరూ భావించారు. ముఖోపాధ్యాయ పుస్తకంలో వ్రాసిన ప్రకారం నరేంద్ర దేవ్ ఓటమి కోసం పంత్ స్వయంగా అయోధ్యలో రాఘవ్ దాస్ కోసం ప్రచారం చేసాడు.  నరేంద్ర దేవ్ నాస్తికుడని, భగవంతుడిని నమ్మని నాస్తికుడు అని ఆలయ పట్టణంలోని ప్రజలకు చెప్పారు.
 
“భక్తులైన హిందువులు ధరించే జుట్టును నరేంద్ర దేవ్ ధరించలేదని పంత్ గుర్తు చేశారు” అని ముఖోపాధ్యాయ తన పుస్తకంలో రాశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఒకటి ఎన్నికైతే రామజన్మభూమికి విముక్తి కలిగిస్తామని ఆనాడే ఉండటం గమనార్హం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే రామజన్మభూమి ఉద్యమంతో ఆ ఉద్యమం పేరు ఏర్పడినప్పటి నుండి అనుబంధం ఏర్పరచుకున్నాడు. 
 
అయోధ్యలో అక్టోబర్ 20, 1949 నుండి తొమ్మిది రోజుల రామచరిత మానస్ అఖండ పర్వం జరిగినప్పుడు, రాఘవ్ దాస్ చివరి రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. హిందూ మహాసభకు చెందిన మహంత్ దిగ్విజయనాథ్‌తో కలిసి వేదికను పంచుకున్నారు.  దిగ్విజయనాథ్‌ మహంత్ వైద్యనాథ్ కు గురువు. వైద్యనాథ్  శిశుడే ప్రస్తుత యుపి ముఖ్యమంతిర్ యోగి ఆదిత్యనాథ్. 
 
రామరాజ్య పరిషత్‌కు చెందిన స్వామి కర్పాత్రి కూడా ఆ అకార్యక్రమంలో పాలగోన్నారు. అయితే,  రాఘవ్ దాస్ పాత్ర అయోధ్యకే పరిమితం కాలేదు. బిజెపి రాజ్యసభ మాజీ ఎంపి బల్బీర్ పుంజ్ రాసిన ‘ట్రిస్ట్ విత్ అయోధ్య’ అనే కొత్త పుస్తకంలో ప్రజలు ఆయనను “గాంధీ ఆఫ్ పూర్వాంచల్” అని కూడా పిలిచారని తెలిపారు.
 
రాఘవ్ దాస్‌ను 1921లో మహాత్మా గాంధీ స్వయంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా చేసారు. అనేక సార్లు జైలుకు వెళ్ళారు. ఆయన గాంధీతో కలిసి 1931లో దండి మార్చ్‌లో కూడా పాల్గొన్నారు. ఆయనను మొదట “బాబా” రాఘవ్ దాస్ అని పిలిచినది గాంధీ అని భావిస్తుంటారు.
 
నిజానికి, రాఘవ్ దాస్‌కు ఆధ్యాత్మిక పూర్వరంగం ఉంది. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలోని బర్హాజ్‌కి చెందిన ప్రసిద్ధ సన్యాసి యోగిరాజ్ అనంత్ మహాప్రభుకు ఆయన శిస్యుడు, వారసుడు కూడా. ఆయన బర్హాజ్‌లో పరమహంస ఆశ్రమాన్ని కూడా నిర్మించారు. విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ విగ్రహాన్ని ఆశ్రమంలో స్థాపించారు.
 
రాఘవ్ దాస్ సంఘ సంస్కర్త కూడా. విద్యా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కుష్టురోగులకు సేవ చేశారు. జమీందారీ భూములను రైతులకు పునఃపంపిణీ చేయడానికి వినోబా భావే యొక్క భూదాన్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు.
 
మహారాష్ట్రలోని పూణేలోని బ్రాహ్మణ కుటుంబంలో రాఘవేంద్రగా జన్మించిన రాఘవ్ దాస్ 17 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచిపెట్టి, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో “సత్యం కోసం” తిరుగుతూ మౌనీ బాబా అనే సన్యాసి నుండి హిందీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత రాఘవ్ దాస్ హిందీ భాషపై సాధికారికత సంపాదించుకున్నారు. 
 
బర్హాజ్‌లోని తన ఆశ్రమంలో రాష్ట్ర భాషా విద్యాలయాన్ని ప్రారంభించారు. బర్హాజ్‌లో లెప్రసీ హోమ్, డిగ్రీ కళాశాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికీ తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని విద్యా సంస్థలు రాఘవ్ దాస్ పేరుతో ఉన్నాయి. వాటిలో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, గోరఖ్‌పూర్; బాబా రాఘవ్ దాస్ ఇంటర్ కాలేజ్, డియోరియా; బాబా రాఘవ్ దాస్ డిగ్రీ కాలేజ్, బర్హాజ్ ముఖ్యమైనవి.
 
రాఘవ్ దాస్ 1958లో మరణించారు. డిసెంబర్ 12, 1998న, వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో, నెహ్రూతో తలపడిన ‘రామ్ భక్త్’ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ్ఞాపకార్థం ఒక తపాలా స్టాంపును దాస్ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం విడుదల చేసింది.
 
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుండి)