
* షర్మిల ఆరోపణలపై బిజెపి నేత విల్సన్ ఆగ్రహం
టిడిపి, వైసీపీలకు ఓటు వేయడం బిజెపికి ఓటు వేసిన్నట్లే అంటూ ఆ రెండు పార్టీలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంకు దాసోహం అయి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేబడుతూ వై ఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగనన్న బాణం షర్మిలకి ఇప్పుడు నిజాలు తెలిసాయా? నాలుగేళ్లు అన్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తే గొంతు పెగల్లేదే? డాక్టర్ సుధాకర్ ని బట్టలు విప్పి కొట్టి నప్పుడు రాజన్న కూతురి స్వరం ఎందుకు మూగబోయింది? రాష్ట్రంలో మద్యం పేరుతో జగనన్న మారణ హోమం చేస్తుంటే ఎందుకు పెదవి విప్పలేదు? అంటూ ఆయన ఆమెను నిలదీశారు.
యుద్ధభూమిలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే మగాళ్లు ఎక్కువ మంది చనిపోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నిలదీసినప్పుడు ఆమె చెవులకి ఆ ఆర్తనాదం వినిపించలేదా? ఎవరైనా సీసం పోశారా ఆ చెవుల్లో? అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ నిరంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉందని స్పష్టం చేస్తూ నాలుగున్నర ఏళ్లు కోమాలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అంటూ విల్సన్ విమర్శించారు. అన్న రాష్ట్రాన్ని అప్పుల ఊభి లోకి కూరుకు పోయేలా చేస్తుంటే ఏనాడైనా రాష్ట్ర ప్రజల కోసం పెదవి విప్పావా తల్లీ? అని ఆమెను నిలదీశారు.
పురందేశ్వరి గుండెలదిరేలా వాగ్బాణాలు విసురుతుంటే ఏనాడైనా సంఘీభావం తెలియజేసావా రాజన్న కూతురా? అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఆమెను క్రేన్ మీద ఎత్తుకు పోతుంటే ఇప్పుడు రాజకీయ ఆశ్రమం ఇచ్చిన నీ రాహుల్ బాబా అప్పుడు ఏం చేసినట్టు? ఎందుకు నీకు మద్దతు తెలుపలేదు? అంటూ ఆయన గుర్తు చేశారు.
సాక్షాత్తు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన నోరు ఇదేనా? అంటూ షర్మిల వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదు కాబట్టి దానికి సరి సమానమైన ప్యాకేజీ ప్రకటిస్ నాడు మద్దతు తెలిపిన చంద్రబాబు కానీ, పాతిక సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న అనే జగనన్న గాని పొద్దుతిరుగుడు పువ్వుల్లా మారారు తప్ప బీజేపీ మొదటి నుంచి ఒకే విధానం అవలంభిస్తోందని విల్సన్ స్పష్టం చేశారు.
సొంత చిన్నాయాన్ని నీ కుటుంబ సభ్యులే హత్య చేస్తే ఏనాడైనా పెదవి విప్పి మాట్లాడావా? అన్న అవినీతిలో వాటాలు అడిగావు తప్ప ఎప్పుడైనా సరే అన్న అవినీతి గురించి మాట్లాడావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం నడుస్తుందని చెప్పిన నువ్వు అకస్మాత్తుగా పొద్దుతిరుగుడు పువ్వులా దిశ మార్చుకున్నావు తప్ప బీజేపీ ఎప్పుడూ ఒకేలా వ్యవహారిస్తుంది బంగారు తల్లీ అంటూ విల్సన్ ఆమెకు చురకలు అంటించారు.
బిజెపి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది తప్ప జగనన్నలా లూటీ చేయడం కోసం కాదని పేర్కొంటూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అప్పనంగా లూటీ చేసిన మీరు బిజేపిని విమర్శించడానికి అర్హులేనా? అంటూ మండిపడ్డారు. అమరావతి మహిళల డొక్కల పై బూట్ కాళ్ళు పడుతుంటే మీలో స్త్రీత్వం ఎప్పుడైనా స్పందించిందా? అంటూ నిలదీశారు.
అమరావతి రైతులను సందర్శించి ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ నిధులు తరలిస్తుంటే అవుతుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎప్పుడైనా మీ గుండె కదిలిందా? అంటూ విల్సన్ ప్రశ్నించారు. బిజెపి సిద్ధాంతం మీద బతికే పార్టీ. రాజకీయ అవకాశాల కోసం అడ్డమైన గడ్డి తినే పార్టీ కాదు గుర్తుంచుకో అంటూ హితవు చెప్పారు.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం
తన తండ్రి హత్యా కేసుపై గవర్నర్ కు డా. సునీత ఫిర్యాదు