భారత్ లో 8 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య కాలంలో భారత్‌లో విద్యుత్‌ వినియోగం సుమారు 8 శాతం పెరిగి 1,221.15 బిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. 2022-23లో ఏప్రిల్‌- డిసెంబర్‌ లమధ్య విద్యుత్‌ వినియోగం 1,132.11 బిలియన్‌ యూనిట్ల వద్ద నిలిచినట్లు ఆదివారం నివేదిక తెలిపింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ వినియోగం 1,504.26 యూనిట్లతో పోలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 1,374.02 బిలియన్‌ యూనిట్ల కంటే అధికంగా నిలిచింది. 2023 వేసవిలో దేశ విద్యుత్‌ వినియోగం 229 గిగా వాట్ల (జిడబ్ల్యు) కు చేరుకుంటుందని విద్యుత్‌ శాఖ అంచనావేసింది.

అకాల వర్షాల కారణంగా ఏప్రిల్‌- జులైలో డిమాండ్‌ అంచనా స్థాయికి చేరుకోలేదు. కానీ జూన్‌లో గరిష్ట డిమాండ్‌ 224.1 జిడబ్ల్యు కొత్త గరిష్టస్థాయిని తాకింది. జులైలో 2.9.03 జిడబ్ల్యుకి పడిపోయింది. తిరిగి ఆగస్టులో గరిష్టడిమాండ్‌ 238.82 జిడబ్ల్యులకి చేరుకుంది.  సెప్టెంబర్‌లో రికార్డుస్థాయిలో 243.27జిడబ్ల్యులకి చేరుకోగా, అక్టోబర్‌లో గరిష్ట డిమాండ్‌ 222.16జిడబ్ల్యు, నవంబర్‌లో 204.77జిడబ్లు, డిసెంబర్‌లో 213.62 జిడబ్ల్యుగా ఉంది.

నిపుణుల అంచనాల ప్రకారం. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో విద్యుత్‌ వినియోగంపై ప్రభావం పడింది.  అయితే తేమ వాతావరణ పరిస్థితుల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో విద్యుత్‌ వినియోగం పెరిగిందని తెలిపారు.

పండుగల ప్రభావంతో పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకున్నాయని చెప్పారు. 2013-14 నుండి 2022-23 వరకు విద్యుత్‌ డిమాండ్‌ 50.8 శాతం పెరిగిందని డేటా తెలిపింది. గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2013-14లో 136 గిగావాట్ల నుండి సెప్టెంబర్‌ 2023 నాటికి 243 గిగావాట్లకు పెరిగింది.