16వ ఆర్థిక సంఘంకు కొత్తగా సలహాదారుడు 

16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడు పోస్టులకు ఆమోదముద్ర వేసింది. కొత్తగా ఆర్థిక సలహాదారు, ఇద్దరు జాయింట్‌ సెక్రెటరీ పోస్టులను సృష్టించినట్లు కేంద్రం తెలిపింది. 

కమిషన్‌కు సహాయం అందించేందుకు ఈ పోస్టులను కొత్తగా తీసుకువచ్చినట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద ఇచ్చిన అధికారాలను ఉపయోగించి ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  రెండున్నర వారాల క్రితమే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుపై, 16వ ఫైనాన్స్ కమిషన్ కోసం పోస్టుల సృష్టికి డిసెంబర్ 31, 2023న నోటిఫికేషన్ విడుదల చేయగా, తాజాగా కేబినెట్‌ సమావేశంలో అధికారికంగా ఆమోదం తెలిపినట్లు కేంద్రం పేర్కొంది. కమిషన్‌పై ఉన్న పనిభారాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్థిక సలహాదారు. ఇద్దరు జాయింట్‌ సెక్రెటరీ పోస్టులను తీసుకువచ్చినట్లు తెలిపింది. 

ముగ్గురు అధికారులు 16వ ఆర్థిక సంఘానికి ఎలాంటి ఆటంకం లేకుండా సజావువుగా పనులు పూర్తి చేసేందుకు సహకారం అందిస్తారని పేర్కొంది. గతేడాది డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాగా నియమించింది. కమిషన్ కార్యదర్శిగా రిత్విక్ రంజనం పాండే బాధ్యతలు అప్పగించింది. 

కమిషన్ నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనున్నది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు నిధుల కోసం ప్రస్తుత ఏర్పాటును కమిషన్ సమీక్షిస్తుంది. అలాగే కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయాన్ని పెంచేందుకు సూచనలు చేస్తుంది.