సైనిక శక్తిలో నాలుగో బలమైన దేశంగా భారత్

ప్రపంచంలో ఏ దేశానికైనా సైనిక శక్తీ చాలా ముఖ్యం. తమ దేశాన్ని కాపాడుకోవడంలో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మిలిటరీ ముందుంటుంది. వివిధ దేశాల సైనిక శక్తీ వివరాలను గ్లోబల్‌ ఫైర్‌ తాజాగా విడుదల చేసింది. గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్-2024 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అమెరికా అత్యంత బలమైన సైనిక శక్తిగల దేశం కాగా, భారత్ సైనిక శక్తిలో నాలుగో స్థానంలో ఉంది.
మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్‌లుగా మార్చి విడుదల చేసింది.  సైనికుల సంఖ్య, ఆయుధాలు, ఆర్థిక సుస్థిరత, భౌగోళిక పరిస్థితి, వనరులు ఇలా మొత్తం 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించింది. గ్లోబల్ ఫైర్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానం దక్కించుకుంది. 

రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో చైనా దేశాలు నిలిచాయి. ఇక ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా భారత్‌ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. దక్షిణ కొరియా, యూకే, జపాన్, తుర్కియే, పాకిస్థాన్, ఇటలీ మిగతా స్థానాల్లో ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే సైనిక శక్తి బలహీనంగా ఉన్న దేశాల జాబితాను కూడా గ్లోబల్‌ ఫైర్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో భూటాన్‌ తొలి స్థానంలో నిలిచింది. మాల్డోవా, సూరినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా, బెలిజ్, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10 దేశాలు:

1. అమెరికా, 2. రష్యా,3. చైనా, 4. భారతదేశం, 5. దక్షిణ కొరియా,
6. యునైటెడ్ కింగ్‌డమ్, 7. జపాన్, 8. తుర్కియే, 9. పాకిస్తాన్‌,
10. ఇటలీ.

ప్రపంచంలో మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న 10 దేశాలు:

1. భూటాన్,  2. మోల్డోవా, 3. సురినామ్, 4. సోమాలియా, 5. బెనిన్,
6. లైబీరియా, 7. బెలిజ్, 8. సియెర్రా లియోన్, 9. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 10. ఐలాండ్‌.