రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా భారత ఆయుధ సంపత్తి

ఈ ఏడాది రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వదేశీ ఆయుధాలు ఆకర్షణగా నిలువనున్నాయి. ఎల్‌సీహెచ్‌ ప్రచండ హెలికాప్టర్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, యాంటీ ట్యాంక్ మిస్సైల్ నాగ్ తదితర స్వదేశీ ఆయుధాలు కవాతులో ప్రదర్శించనున్నారు.  ఎల్‌సీహెచ్‌ ప్రచండ హెలికాప్టర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది.
ఇది దేశ తొలి మల్టిపుల్‌ కంబాట్‌ హెలికాప్టర్‌. భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ల్యాండ్, టేకాఫ్ చేసుకోవడం దీని ప్రత్యేకత. ప్రపంచంలో ఈ తరహా దాడులు చేయగలిగితే ఏకైక హెలీకాప్టర్‌ ఇదే కావడం విశేషం.  ఈ హెలికాప్టర్‌లో ఆధునిక స్టెల్త్‌ టెకాల్నజీ ఉండగా, రక్షణ కవచంగా ఉండడంతో పాటు రాత్రిళ్లు సైతం దాడులు చేసే సామర్థ్యం ఉన్నది.
ఆధునిక నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ఇందులో అమర్చారు. ఇక నాగ్ క్షిపణి వ్యవస్థను డీఆర్డీవో అభివృద్ధి చేసింది.  శత్రు ట్యాంకులను ధ్వంసం చేయడంలో ఈ క్షిపణి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ క్షిపణి వ్యవస్థ పగలు, రాత్రిళ్లు సైతం చేయగలదు. లక్ష్యాన్ని ఆటోమేటిక్‌గా ఛేదించనున్నది. ఈ మిస్సైల్‌ను భూమిపై నుంచి సముద్రం నుంచి ప్రయోగించవచ్చు.

వీటితో పాటు దేశంలోనే తయారైన ఆయుధాలను సైతం రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించే అవకాశాలున్నాయి. అత్యాధునిక సాయుధ వాహనాలు, ఇతర ప్రత్యేక వాహనాలను సైతం ప్రదర్శించనున్నారు. 

టీ-90 ట్యాంక్, బీఎంపీ-2 పదాతిదళ ఫైట్‌ వెహికిల్‌, డ్రోన్ జామర్లు, అధునాతన ఆల్ టెర్రైన్ వంతెన, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, మల్టిపుల్‌ ఫంక్షన్‌ రాడార్ తదితర ఆయుధాలను కవాతులో ప్రదర్శించేందుకు రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అతిథిగా హాజరుకానున్నారు.