గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై నిషేధాజ్ఞ‌లు

గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై నిషేధాజ్ఞ‌లు ఎత్తివేయాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గోధుమలు, పంచదారను భారత్ దిగుమతి చేసుకోబోదని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

`గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలన్న ప్రతిపాదన ఇప్పటికైతే ప్రభుత్వం వద్ద లేదు. విదేశాల నుంచి గోధుమలు, పంచదార భారత్ దిగుమతి చేసుకోదు’ అని పీయూష్ గోయల్ తెలిపారు.

దేశీయ మార్కెట్లో ధరలను అదుపు చేయడానికి గతేడాది అక్టోబర్ నుంచి పంచదార ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం. అంతకుముందు జూలై నుంచి బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. 

2022 మే నుంచి గోధుమల ఎగుమతిపై నిషేధం అమల్లోకి తెచ్చింది.త్వరలో పలు రాష్ట్రాలతోపాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.