రాముడిపై లోహియా ఆలోచనలను కప్పిపుస్తున్న ఆయన శిష్యులు

* లోహియా పుస్తకం `రాముడు, కృష్ణుడు, శివ’ చదివారా?
 
సమాజ్‌వాదీ పార్టీ  వెబ్‌సైట్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియాను పార్టీకి ‘మార్గదర్శక స్ఫూర్తి’గా అభివర్ణించింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తనను తాను లోహియాకు ‘గట్టి శిష్యుడు’ అని చెప్పుకోవడానికి గర్వపడేవారు. తన సెక్యులర్ క్రెడెన్షియల్స్ ని చెప్పుకునేలా నిరూపించుకోవడానికి తనను తాను ‘లోహియైట్’గా అభివర్ణించుకునేవారు.
 
ప్రస్తుతం, ములాయం కుమారుడు అఖిలేష్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. లోహియా విషయానికి వస్తే అతను తన తండ్రిని అనుసరిస్తూనే ఉన్నాడు. అయితే, లోహియా అంటే ఏమిటో ములాయం గానీ, అఖిలేష్ గానీ చదివినట్లు లేదా అర్థం చేసుకున్నట్లు లేదు. వారు కేవలం లోహియాను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.
 
లోహియాను అర్థం చేసుకుని ఉంటే 1990లో ములాయం కరసేవకులపై కాల్పులు జరిపి ఉండేవాడు కాదు. లోహియాను అర్థం చేసుకుని ఉంటే అఖిలేష్ అయోధ్యలో ‘దీపోత్సవ్’ను అపహాస్యం చేసి ఉండేవారు కాదు. వామపక్షాలు లేదా సోషలిస్టులు తమ సైద్ధాంతిక ప్రత్యర్థులను ఒక నిర్దిష్ట పద్ధతిలో అంచనా వేసినట్లు అర్థం చేసుకోవచ్చు.
 
అయినప్పటికీ, వారి స్వంత సైద్ధాంతిక చిహ్నం తప్పుగా సూచించబడితే వారు ఎలా వివరించగలరు? లోహియాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని వారు సంవత్సరాలుగా దాచిపెట్టినట్లయితే వారు ఎలా వివరించగలరు? దురదృష్టవశాత్తు, మహాత్మా గాంధీ వలె, లోహియా తన స్వంత అనుచరుల బాధితుడు.
 
లోహియా రాసిన `రాముడు, కృష్ణుడు, శివ’ అనే పుస్తకాన్ని ఎవరైనా చదివితే, కరసేవకులపై కాల్పులు జరిపినందుకు ములాయంను లోహియా ఎప్పటికీ క్షమించరని ఖచ్చితంగా అనిపిస్తుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు పెట్టిన ములాయన్‌ను లోహియా ఎప్పటికీ క్షమించరు.
ఏళ్ల తరబడి హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు ములాయం,  ఇతర వామపక్షాలను లోహియా ఎప్పటికీ క్షమించరు.
లౌకికవాదాన్ని ‘బుజ్జగింపు విధానం’గా వ్యాఖ్యానించినందుకు లోహియా వారిని ఎప్పటికీ క్షమించరు. భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడిగా లోహియాకు పేరుంది.  లోహియాను బలమైన నెహ్రూ విమర్శకుడిగా కూడా అభివర్ణిస్తారు. అరవయ్యవ దశకంలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని నిర్మించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. లోహియా ఎప్పుడూ రాజకీయ లేదా సైద్ధాంతిక అంటరానితనాన్ని విశ్వసించలేదు.
 
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహాకూటమిలోకి భారతీయ జన్‌సంఘ్‌ను ఆహ్వానించడానికి ఆయనకు ఎలాంటి సంకోచానికి గురికాలేదు. లోహియా నిజాయితీ గల రాజకీయ నాయకుడు కనుక ఇది సాధ్యమయింది. ఆయన నిజాయితీగల రాజకీయవేత్త, తన శిష్యులకు భిన్నంగా ఎల్లప్పుడూ భావజాలం కోసం నిలబడేవారు.
 
ఆయన విధానాలు ఎల్లప్పుడూ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం కాకుండా జాతీయ ప్రయోజనాల కోసం ఉండెడివి. ఈ నేపధ్యంలో, రాముడు, రామాయణం గురించి లోహియా ఏమని భావించారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 
 
“రాముని `దేశ బహిష్కరణ’  రెండు బలమైన ప్రత్యర్థి కేంద్రాల ఆధిపత్యం కోసం ప్రయత్నం జరుగుతున్న దేశాన్ని ఒక అధికార కేంద్రం ఆధిపత్యం క్రింద ఏకం చేయడానికి ఒక సందర్భం.  అయోధ్య, లంక ఈ రెండు కేంద్రాలు. రాముడి సంచారం ఆయన్ని అయోధ్య నుండి లంకా దిశలో తీసుకువెళ్లింది”.  ఇవి లోహియా పుస్తకంలోని కొన్ని పంక్తులు. లోహియా సామ్యవాది.   మతంపై తక్కువ విశ్వాసం ఉండేది. ఆయనకు భారతీయ మానసిక స్థితి గురించి బాగా తెలుసు. సున్నితంగా ఉండేవారు. ఆయన ఇలా వ్రాసారు: 
 
“గొప్ప భారతీయ పురాణాలలోని హీరోలు ఎప్పుడైనా జీవించారా? లేదా? అనేది దేశపు సాంస్కృతిక చరిత్రకు, భారతీయ ఆత్మ చరిత్రకు ఖచ్చితంగా సంబంధం లేని అంశం. ఈ రోజు వరకు భారతదేశ చరిత్ర ఆత్మకు తులనాత్మకంగా అసంబద్ధమైన వివరాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు బహుశా చరిత్రకు చెందిన వ్యక్తులు కావచ్చు.  శివుడు కూడా గొప్ప గంగ కోసం ఒక ప్రవాహాన్ని కట్టడి చేసిన ఇంజనీర్ అయి ఉండవచ్చు. కానీ అదే కారణంతో ఆయన గొప్ప పశువైద్యుడు, ప్రేమికుడు లేదా ఉదాహరణ లేని పరోపకారి అయి ఉండవచ్చు”.
 
లోహియాకు  రాముడు ఉన్నాడా? లేదా? అనే ప్రశ్న అప్రస్తుతం. ఆయనకు రామాయణం పురాణం కావచ్చు కానీ ఆయన సత్యాన్ని తిరస్కరించలేదు. నిజం ఏమిటంటే రామాయణం భారతదేశ సాంస్కృతిక చరిత్రలో విడదీయరాని భాగం. ఆయన తన భావజాలానికి మించి, రాముడు, కృష్ణుడు, శివుడి పేర్లు తరువాతి తరం మనస్సులలో చెక్కబడి ఉన్నాయని చాలా ధైర్యంగా అంగీకరించారు.
 
ఆయన అదే పుస్తకంలో ఇలా వ్రాసారు:  “వారి జీవిత కథలు సాధారణ ప్రమాణాల ద్వారా పరీక్షించబడకూడదు. ఈ కథ యాభై శతాబ్దాలుగా, బహుశా వంద సంవత్సరాలుగా భారతదేశంలోని తరువాతి తరాల మనస్సులలో చెక్కబడి ఉండనెడిది వాస్తవం కంటే మరింత ఆమోదయోగ్యంగా ఉంటుంది”.  “ఈ కథ నిరంతరం తిరిగి చెప్పబడింది.  తిరిగి చెప్పడంలో, ప్రతిభావంతులు, కవులు  దీనిని మెరుగుపరచడానికి, మరింతగా అర్థమయ్యేటట్లు తమ మేధాశక్తిని ఉపయోగించారు.ఇంకా ఎక్కువ సంఖ్యలో లక్షలాది మంది తమ స్వంత అనుభవంలో ఆనందాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెట్టినట్లయితే జతచేశారు”.

(రేపు : సీతా, రాముల బంధంపై లోహియా విస్తృత ఆలోచనలు)