అభివృద్ధి చెందిన భారత్ కు సంకేతం అటల్ సేతు

అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క చిత్రం. అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండబోతుందనేదానికి ఒక సంగ్రహావలోకనంగా అటల్ సేతు కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దిగవంత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుతో `అటల్ సేతు’గా నామకరణం చేసిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడారు. 
 
 దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అయిన 22 కి.మీ అటల్ సేతును ప్రధాని శుక్రవారం ప్రారంభిస్తూ కేంద్రంలోని గత ప్రభుత్వాలు తమ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, కానీ ఈ వంతెన అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రతీక అని పేర్కొన్నారు.
 
“అభివృద్ధి చెందిన భారతదేశంలో అందరికీ సౌకర్యాలు ఉంటాయి, అందరికీ శ్రేయస్సు ఉంటుంది, వేగం ఉంటుంది, పురోగతి ఉంటుంది. అభివృద్ధి చెందిన భారతదేశంలో, దూరాలు తగ్గుతాయి, దేశంలోని ప్రతి మూలను కలుపుతారు. అది జీవనాధారమైనా, ప్రతి ఒక్కటి నిరంతరాయంగా, అంతరాయం లేకుండా సాగిపోతుంది. ఇదే అటల్ సేతు సందేశం’’ అని ప్రధాని స్పష్టం చేశారు. 
 
ఆరు లేన్ల ఈ వంతెనను శనివారం ఉదయం ప్రజల కోసం తెరిచారు. ముంబైలోని సెవ్రిని రాయ్‌గఢ్ జిల్లాలోని చిర్లేను కలుపుతుంది. ఇది ముంబై నుండి నవీ ముంబై, పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన రాయ్‌గఢ్ జిల్లాలోని ప్రదేశానికి చేరుకోవడానికి ప్రధాని ముంబై నుంచి వంతెన మొత్తం ప్రయాణించారు.
 
బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ “ముంబై, మహారాష్ట్రలకు ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. విక్షిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) కోసం సంకల్పానికి అనుగుణంగా, ఈ రోజు దేశం ప్రపంచంలోని అతి పొడవైన సముద్ర వంతెనలలో ఒకటైన అటల్ సేతును అందుకుంది” అని తెలిపారు.
 
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని జపాన్ దిగవంత ప్రధాని షింజో అబే భరోసా ఇచ్చారని చెబుతూ జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదట 1960లలో ఆలోచన చేయబడగా, 2006లో మొదటి టెండర్ వేయడం జరిగిందని, ఇది చాలాసార్లు డ్రా కావడంతో అనేక విఫలమైన ప్రాజెక్ట్ బిడ్డింగ్‌లకు గురైందని ప్రధాని వివరించారు.
 
చివరకు 2018లో పని ప్రారంభించకముందే ప్రధానంగా ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చిన జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ కారణంగా ఇది తీవ్రమైన వ్యాపార వివాదంలో చిక్కుకుందని చెప్పారు. సీ బ్రిడ్జి ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని మోదీ తెలిపారు.
 
గత ప్రభుత్వ పనుల్లో నిదానం, సందేహాస్పద ఉద్దేశాలకు నేడు భిన్నంగా జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. “మన ‘నియత్’ (ఉద్దేశం) స్వచ్ఛమైనది, ‘నిష్ఠ’ (నిబద్ధత) దేశ పురోగతి, అభివృద్ధికి సంబంధించినదని మోదీ స్పష్టం చేశారు. అయితే, గత ప్రభుత్వ ఉద్దేశం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి తమ ఖజానాను నింపుకోవడమే అంటూ ప్రధాని ధ్వజమెత్తారు. వారి నిబద్ధత వారి కుటుంబ సభ్యులకే ఉంది తప్ప దేశం పట్ల కాదని మండిపడ్డారు. 
 
 దేశంలోని భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తమ ప్రభుత్వం వేగంగా కదులుతోందని పేర్కొంటూ  “ఇంతకుముందు, ప్రజలు పనిని సంవత్సరాల తరబడి ఆలస్యం చేసే అలవాటు ఉన్న వ్యవస్థపై ఆశలు లేవు. బతికుండగా పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమని ప్రజలు భావించారు. అందుకే దేశం మారుతుందని హామీ ఇచ్చాను. ఇది అప్పట్లో ‘మోదీ  గ్యారెంటీ’” అని వెల్లడించారు.
 
“2014 ఎన్నికలకు ముందు, నేను రాయగఢ్ కోటను సందర్శించాను.   కొన్ని హామీలు ఇచ్చాను. వాటిలో అటల్ సేతు ఒకటి. పదేళ్ల క్రితం వేల కోట్ల మెగా కుంభకోణాల గురించి మాట్లాడేవారు, కానీ ఇప్పుడు వేల కోట్ల మెగా ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది” అంటూ తెలిపారు.  బాంద్రా వర్లీ సీలింక్ అటల్ సేతు కంటే ఐదు రెట్లు చిన్నదైనప్పటికీ, పూర్తి చేయడానికి దాదాపు పదేళ్ల సమయం పట్టిందని మోదీ గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ప్రతిపాదిత ఆరెంజ్ గేట్ టు మెరైన్ డ్రైవ్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. దిఘా గోవాన్ సబర్బన్ స్టేషన్, ఉరాన్ ఖార్కోపర్ కొత్త సబర్బన్ లైన్, ఖార్ రోడ్, గోరేగావ్ మధ్య ఆరవ లైన్, నవీ ముంబై మెట్రో వన్, సూర్య ప్రాంతీయ తాగునీటి ప్రాజెక్ట్. సహా పలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.