ఫ్రాన్స్ కొత్త ప్రధాని గాబ్రియెల్ అటల్ ఒక ‘గే’

ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల కుర్రాడు నియమితులయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న గ్యాబ్రియెల్ అటల్‌ను ప్రధానిగా ఎంపిక చేశారు. కొత్తగా ప్రధానిగా నియమితులైన  ఫ్రాన్స్ లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా, మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్క ప్రభుత్వాధినేతగా చరిత్ర సృష్టించారు.
 
ఎలిజబెత్ బోర్న్ ఫ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మంగళవారం ఆ దేశ విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్  ఫ్రాన్స్ ప్రధానిగా నియమించారు. ఎలిజబెత్ బోర్న్ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే ప్రధాని పదవిలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఉండగా, అకస్మాత్తుగా రాజీనామా చేశారు.
 
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు గాబ్రియేల్ అట్టల్ అత్యంత సన్నిహితుడు. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు. పార్లమెంట్ లో, రేడియో షోలలో సమర్ధవంతమైన వక్తగా పేరుగాంచారు.  త్వరలో జరుగనున్న ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
గతేడాది తీసుకొచ్చిన అన్ పాపులర్ పెన్షన్, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఎమ్మాన్యుయెల్.  తన ప్రత్యర్థి మారిన్ లే పెన్స్ ముందు ఎమ్మాన్యుయెల్ ప్రజాదరణ కోల్పోయారు. ఆయన ప్రజాదరణ ఎనిమిది నుంచి పది శాతానికి పడిపోయింది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో గ్యాబ్రియెల్ పరపతి క్రమంగా పెరుగుతున్నది.

ఈ నేపథ్యంలో జూన్ ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు గ్యాబ్రియెల్ అటల్’ను ప్రధానిగా నియమించినట్లు తెలుస్తున్నది. ఇక ప్రస్తుత ప్రధాని ఎలిసాబెత్ బోర్న్ స్థానంలో నియమితులైన గ్యాబ్రియెల్ అటల్ కరోనా మహమ్మారి ఉధ్రుతి వేళ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నిలిచారు.