ఆదిత్య ఎల్‌-1 విజయవంతంపై నాసా అభినందన

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోలార్‌ మిషన్‌ ఆదిత్య ఎల్‌-1 హాలో విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. చంద్రయాన్‌-3 తర్వాత మరో మైలురాయిని చేరింది. తొలి ప్రయత్నంలోనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు.  అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ (నాసా) శాస్త్రవేత్త డాక్టర్‌ అమితాబ్‌ ఘోష్‌ సైతం ప్రయోగాన్ని అద్భుతమైన ప్రయాణంగా పేర్కొంటూ ఇస్రోను అభినందించారు.
శాస్త్రీయంగా ముఖ్యమైందని చెబుతూ భారత్‌ ప్రస్తుతం చాలా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతోందని, గగన్‌యాన్‌ కోసం సన్నాహాలు చేస్తుందని పేర్కొన్నారు.
గత ఇస్రోతో సహా అంతరిక్ష ప్రపంచంలో అద్భుతమైన విజయాలు సాధించిందని చెబుతూ  ఆదిత్య ఎల్‌ విజయం తర్వాత సైన్స్‌, అంతరిక్ష ప్రపంచంలో భారత్‌ ఎక్కడ నిలబడిందో చూస్ ఇది చాలా ఉత్తేజకరమైన, అద్భుతమైన ప్రయాణం అని తెలిపారు.
 
చారిత్రక ఘట్టం.. గడ్కరీ
 
తొలి ప్రయత్నంలోనే ఇస్రో సోలార్‌ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతోషం వ్యక్తం చేశారు. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టడం ఇస్రో శాస్త్రవేత్తల అకుంటిత దీక్షకు నిదర్శనమని ఆయన కొనియాడారు. అంతరిక్ష అన్వేషణా యానంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని చెప్పారు. 
 
ఇస్రో సైంటిస్టుల అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. క్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో విజయం శాస్త్రవేత్తల నిబద్ధతకు నిదర్శమని కొనియాడారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం కూడా ఇస్రో విజయాలకు కారణమని చెప్పారు. ఆదిత్య- ఎల్1 విజయం భారతదేశ అంతరిక్ష ప్రయత్నాల పరాక్రమాన్ని ప్రతిబింబిస్తున్నదని తెలిపారు.