![సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా చారిత్రక విజయం సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా చారిత్రక విజయం](https://nijamtoday.com/wp-content/uploads/2024/01/India-win.webp)
* చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం
సౌతాఫ్రికా గడ్డపై చారిత్రక విజయం సాధించింది టీమిండియా. కేప్‌టౌన్ లో ఇప్పటి వరకూ సాధ్యం కాని విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవకపోయినా 2010లో ధోనీ తర్వాత సిరీస్ ను సమం చేసిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. మొదట టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్ తర్వాత వన్డే సిరీస్ ను 2-1తో గెలిచింది.
రోహిత్ శర్మ 17, శ్రేయస్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓపెనర్లు యశస్వి, రోహిత్ ధాటిగా ఆడి మొదట్లోనే సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెంచడంతో టీమిండియా విజయం సులువైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లోనూ 176 పరుగులే చేయగలిగింది.
ఇండియన్ టీమ్ తరఫున తొలి ఇన్నింగ్స్ లో మహ్మద్ సిరాజ్, రెండో ఇన్నింగ్స్ బుమ్రా ఆరేసి వికెట్లు తీసుకోవడం విశేషం. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా ఓపెనర్ ఏడెన్ మార్‌క్రమ్ (106) వీరోచిత సెంచరీ చేసినా అది వృథా అయిపోయింది. కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో పేస్ కు అనుకూలించిన పిచ్ పై తొలి రోజే రెండు జట్లు కలిపి 23 వికెట్లు పడగొట్టడం విశేషం. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి రోజే 25 వికెట్లు పడిన తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి రోజు తొలి సెషన్ లోనే కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియన్ టీమ్ 153 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగులు ఆధిక్యం సంపాదించింది.
పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఇది చాలా మంది ఆధిక్యమే. తర్వాత సౌతాఫ్రికాలో 176 రన్స్ చేయడంతో చివరికి విజయానికి కేవలం 79 రన్స్ మాత్రమే అవసరమయ్యాయి. దానిని సులువగా చేజ్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో కీలకమైన విజయం సాధించింది.
More Stories
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు