భారత ఆర్థిక వృద్ధి, విదేశీ వ్యవహారాలపై చైనా ప్రశంసలు

భారత్ అన్నా, భారత ప్రధాని అన్నా ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే చైనా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తింది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన హయాంలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించిందని పేర్కొంది.  షాంఘై ప్రావిన్స్‌లోని ఫుడాన్ యూనివర్శిటీలో ఉన్న సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన ఓ స్టోరీని చైనీస్ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తాజాగా ప్రచురించింది.
ముఖ్యంగా గడిచిన 4 ఏళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలను అందులో ప్రస్తావించింది. ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని, అది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నందునే సాధ్యమైందని చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అందులో వ్యాఖ్యానించింది. 
భారత్ ఆర్థికాభివృద్ధిలోగణనీయమైన వృద్ధి సాధించిందని, పట్టణ పరిపాలన ఎంతో మెరుగుపడిందని పేర్కొన్న ఆ వ్యాసం అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా చైనా విషయంలో దాని వైఖరిలో మార్పు వచ్చిందని పేర్కొంది.‘ ఉదాహరణకు చైనా, భారత్‌ల మధ్య వాణిజ్య అసమానతల గురించి చర్చించేటప్పుడు భారతీయ ప్రతినిధులు గతంలో ఈ అసమానతలను తగ్గించడంలో చైనా తీసుకునే చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టే వారని, కానీ ఇప్పుడు భారత ఎగుమతుల సామర్థం గురించి ఎక్కువగా నొక్కి చెబుతున్నారు’ అని ఝాంగ్ తన వ్యాసంలో పేర్కొన్నారు.
 
భారత బలమైన ఆర్థిక వృద్ధి, అర్బన్ గవర్నెన్స్‌ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దినట్లు కొనియాడింది. అంతర్జాతీయ సంబంధాలు మరీ ముఖ్యంగా చైనాతో భారత్ తన వైఖరి మార్పును ప్రస్తావించింది. వాణిజ్యం పరంగా చైనా, భారత్ మధ్య ఉన్న అసమానతలను తగ్గించేందుకు భారత్ ఎన్నో చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించిందని పేర్కొంది. 
 
ఇక ప్రస్తుతం భారత్ తన ఎగుమతుల సామర్థ్యాలను పెంచుకునేందుకు ఎక్కువ దృష్టి పెడుతోందని వెల్లడించింది. అత్యంత వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధితో భారత్ వ్యూహాత్మకంగా నమ్మకంగా రూపొందించి అభివృద్ధి చేయడంలో భారత్ మరింత క్రియాశీలకంగా మారిందని కథనం పేర్కొంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించిన భారత్ భారతీయతను ఎక్కువ ప్రచారం చేసేందుకు వ్యూహాత్మకంగా మరింత ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తోందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
 
మరోవైపు.. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో.. పాశ్చాత్య దేశాలతో తన ప్రజాస్వామ్య ఏకాభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి ప్రజాస్వామ్య రాజకీయాల్లో భారతీయ లక్షణాన్ని హైలైట్ చేసే స్థాయికి చేరుకుందని ప్రశంసించింది. ఇక ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజకీయాల భారతీయ మూలాలపై మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పింది. 
 
చారిత్రక వలస రాజ్యాల నీడ నుంచి తప్పించుకోవడానికి రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రపంచంలోనే విశ్వ గురుగా వ్యవహరించాలనే ఆశయాన్ని భారత్ ప్రతిబింబిస్తోందని జాంగ్ జియాడాంగ్ కథనం రాశారు.  అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపిన రష్యా-ఉక్రెయిన్ వివాదంలో తటస్థ వైఖరిని అవలంభిస్తూనే అమెరికా, జపాన్, రష్యా వంటి అగ్ర దేశాలతో సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధాన వ్యూహంపై ప్రశంసలు గుప్పించింది. 
 
విదేశాంగ విధానంలో భారత్ వ్యూహాత్మక ఆలోచన మార్పుకు గురైందని, గొప్ప శక్తి వ్యూహం వైపు కదులుతుందని చైనా మీడియా కొనియాడింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా, జపాన్, రష్యాలతో సంబంధాలను మరింతగా ప్రోత్సహిస్తు్న్నారని.. భారత్ ఎల్లప్పుడూ తనను తాను ప్రపంచ శక్తిగా పరిగణిస్తోందని చెప్పింది.