టోక్యో విమానాశ్రయంలో మంగళవారం రాత్రి రెండు విమానాలు ఢీకొనటంతో ఒక విమానం అగ్నికి ఆహుతయ్యింది. 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో హక్కైడో నుంచి వచ్చిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 516 నంబర్ పౌర విమానం రన్‌వేపై దిగే సమయంలో జపాన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన విమానాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి.
మంటల్లో కాలిపోతూనే పౌర విమానం రన్‌వేపై కొద్ది దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కోస్ట్‌గార్డ్ విమానంలోని 5 మంది సిబ్బంది మరణించినట్టు ఆ దేశ అధికార వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఈ విమానంలో 8 మంది సిబ్బంది ఉన్నట్టు వెల్లడించింది. విమాన పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే మెరుపు వేగంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది పౌర విమానంలోని మొత్తం 379 మందిని రక్షించారు.
జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్ 516 విమానం మంగళవారం టోక్యో ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదానికి గురైంది. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 70కిపైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. విమానంలో కూర్చుకున్న ప్రయాణికులు కొందరు కిటికీల నుంచి ఆ ఘటనకు చెందిన వీడియో తీశారు.
ఈ ఘటనపై ప్రధాని పుమియో కిషిడా సమీక్షా జరిపి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెండు విమాన ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి కోస్ట్‌గార్డ్ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
మంటల వల్ల విమానంలో పొగ కమ్ముకున్నది. ఆ సమయంలోనూ కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లతో వీడియో తీశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం 516.. జపాన్‌లోని షిన్ చిటోస్ విమానాశ్రయం నుంచి హనేడాకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటిగా ఉన్న హనేడా. ముఖ్యంగా నూతన సంవత్సర సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
62కు చేరిన జపాన్ భూకంప మరణాలు
మరోవంక, జపాన్ భూకంప ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. దాంతో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జపాన్‌లోని ఇషికావా కేంద్రంగా సోమవారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మొత్తం 21 సార్లు భూమి కంపించింది. జపాన్‌లోని ఇషికావా కేంద్రంగా సోమవారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మొత్తం 21 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల ధాటికి జపాన్ కకావికలం అయ్యింది. ఈ భూకంపాల ధాటికి జపాన్ కకావికలం అయ్యింది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!