తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్రహంమంత్రి అమిత్ షా.. చార్మినార్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమిత్ షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా.. స్వయంగా అమ్మవారికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు.. కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. తర్వాత పూజారులు అమిత్ షాను ఆశీర్వదించారు. అంతకుముందు నోవాటెల్ లో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమైన అమిత్ షా.. పార్టీ నేతల మధ్య సఖత్య లేమిపై క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తించరాదని.. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నేతల మధ్య గ్యాప్.. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తీసిందని.. ఈ సారి అలాంటి పొరపాటు చేయరాదంటూ స్పష్టం చేశారు.

More Stories
మైనర్పై అఘాయిత్యం ఆరోపణలపై ఎమ్యెల్సీ బేగ్ పై ఎంఐఎం వేటు
తుమ్మిడిహెట్టి ఆనకట్టపై 1న కేంద్ర జల సంఘం భేటీ
ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ వివరాలు ఇస్తే జైలు శిక్ష