జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక తెలుగు నటుడిగా అరుదైన గౌరవాన్ని నమోదు చేశాడు తారక్. మరోవైపు అమెరికన్ మ్యాగజైన వెరైటీ ప్రకటించిన 500 అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి దక్షిణాది నటుడిగా అరుదైన పొందాడు.
హాలీవుడ్ అవార్డ్స్ సీజన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొని అంతర్జాతీయ ప్రేక్షకుల్లో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు తారక్. ఆర్‌ఆర్‌ఆర్‌తో అదిరిపోయే హిట్టందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో నటిస్తున్నాడు.
దేవర చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
దేవర రెండు పార్టులుగా రాబోతుండగా దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తారక్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ 31 చిత్రం చేయబోతున్నాడు.
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?