ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ప్రతిపాదించగా కిరోరీ మీనా, మదన్ దిలావర్, జవార్ సింగ్ బలపరిచారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన దియా కుమారితోపాటు ప్రేమ్ చంద్ బైర్వా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రివర్గంలో కొనసాగుతారు. అసెంబ్లీ స్పీకర్ గా వాసుదేవ్ దేవ్నానీ వ్యవహరిస్తారు.
వసుంధర రాజేతో పాటు దియాకుమారి, కిరోరి లాల్ మీనా, బాలక్ నాథ్.. తదితరులు కూడా సీఎం రేసులో ఉన్నారు. కానీ, అనూహ్యంగా భజన్ లాల్ ను పార్టీ ఎంపిక చేసింది. 200 స్థానాల రాజస్తాన్ అసెంబ్లీలో 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 115 సీట్లను బీజేపీ గెల్చుకుని అధికారంలోకి వచ్చింది.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న భజన్‌లాల్ శర్మ.. జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర జీ భరద్వాజ్‌పై 48 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే, నాలుగు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. 56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. భరత్‌పూర్ నుంచి శర్మ తొలుత టిక్కెట్ ఆశించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో దీనికి బదులు సంగనేరు టిక్కెట్ కేటాయించారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన