వచ్చే ఎన్నికల్లో క్రైస్తవుడే ఏపీ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక క్రైస్తవ మత ప్రచారం విచ్చలవిడిగా సాగుతోందా..? అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు క్రైస్తవ సువార్తికులను మించి మత ప్రచారానికి పాల్పడుతున్నారా..? కన్వర్టడ్ క్రిస్టియన్ ఓటు బ్యాంకు కోసం తమ స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. తాజాగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

ఓ సువార్త సభకు హాజరైన ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఏకంగా రాష్ట్రంలో క్రిస్టియన్ రాజ్యం రావాలంటూ ఆకాంక్షించటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఓ క్రైస్తవుడే మరోసారి గద్దెనెక్కుతాడని ఆయన మాట్లాడటం పై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కోట్లాది మంది ఓట్లతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగా.. కేవలం క్రిస్టియన్ ఓట్లతో మాత్రమే తాము గెలిచామని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పటం పట్ల హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఎమ్మెల్యే ఇలా క్రిస్టియన్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దిగజారి మాట్లాడటం తగదని విపక్షాలు తప్పు పడుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందనటానికి ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి.