అప్పుల్లోనూ మెుదటి స్థానంలో అంబానీ

మన దేశంలో కొంతకాలంగా అత్యధిక  సంపద గల వ్యక్తుల గురించి మనం తరచూ వింటుంటారు. దేశంలో అత్యంత సంపన్నులలో ఒకరుగా సుదీర్ఘకాలంగా పేరొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అత్యధికంగా అప్పులు గల వ్యక్తిగా కూడా ఇప్పుడు గుర్తింపు పొందుతున్నారు.  అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే అదానీ గ్రూప్ కంపెనీలు ఈ జాబితాలో లేకపోవటమే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మెుత్తం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు ఉన్నట్లు తాజా డేటా ప్రకారం వెల్లడైంది. దీంతో దేశంలో అధికంగా అప్పులు కలిగిన వ్యాపారవేత్తగా ముఖేష్ అంబానీ వార్తల్లో నిలిచారు.  ఈ క్రమంలో రతన్ టాటా కంపెనీలు అంబానీ రిలయన్స్ కంటే తక్కువగా అప్పులను కలిగి ఉన్నట్లు వెల్లడైంది.

అయితే అత్యంత రుణాలను కలిగి ఉన్న రెండవ అతిపెద్ద కంపెనీగా దేశీయ ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఎన్టీపీసీ నిలిచింది. పవర్ రంగంలో కొనసాగుతున్న కంపెనీ మెుత్తం అప్పులు రూ.2.20 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.  ఇక మూడువ స్థానంలో అత్యంత అప్పులు కలిగి ఉన్న కంపెనీగా టెలికాం దిగ్గజం ఒడాఫోన్ ఐడియా రూ.2.01 లక్షల కోట్లతో నిలిచింది. దీని తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన భారతీ ఎయిర్ టెల్ కంపెనీ అప్పులు రూ.1.65 లక్షల కోట్లుగా ఉన్నాయి.

దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.1.40 లక్షల కోట్ల అప్పుల్లో ఉండగా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రూ.1.29 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తోంది. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.1.26 లక్షల కోట్లు, టాటా మోటార్స్ రూ.1.25 లక్షల కోట్ల అప్పును కలిగి ఉండగా, చంద్రయాన్ మిషన్ లో కీలక పాత్ర పోషించిన లార్సెన్ అండ్ టూబ్రోకు రూ.1.18 లక్షల కోట్ల అప్పు ఉంది. 
 
ఇక చివరగా లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పులు కలిగిన కంపెనీగా చివరి స్థానంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ జాబితాలో చివరను రూ.1.01 లక్షల కోట్ల అప్పును కలిగి ఉంది.