విక్రమ్ ల్యాండర్ తో దుమ్ము, రాళ్లు లేచి చుట్టూ ప్రకాశవంతమైన ప్రాంతం

చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ సమయంలో ఉపరితలంపై ఉన్న 2.06 టన్నుల చంద్రుడి మట్టి, ధూళి పైకి లేచినట్లు తెలిపింది.  విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చంద్రుడి దక్షిణ ధృవం వద్ద 108.4 మీటర్ల మేర అక్కడి మట్టి, ధూళి విస్తరించినట్లు ఇస్రో వెల్లడించింది.

కాగా, ఒక అద్భుతమైన ధూళి మేఘంగా ఏర్పడిన దీనిని చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు చెందిన ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.   ‘ఆగస్టు 23, 2023న, చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి మట్టి, ధూళితో అద్భుతమైన ‘ఎజెక్టా హాలో’ను ఉత్పత్తి చేసింది.
పైకి ఎగసి విస్తరించిన చంద్రుడి ఉపరితల పదార్థం సుమారు 2.06 టన్నులు ఉంటుందని ఎన్‌ఆర్‌ఎస్సీ, ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండింగ్ సైట్ చుట్టూ 108.4 మీటర్ల మేర ఇది విస్తరించింది.’ అని  ఇస్రో పేర్కొంది.  దీనిని శాస్త్రవేత్తలు ముందుగానే ఊహించారు. తన చివరి దశ థ్రస్టర్ల వెగాన్ని తగ్గించుకుంటూ విక్రమ్ దిగినప్పుడు చంద్రుడి ఉపరితలంపై పెద్ద మొత్తంలో మట్టి లేదా ఎగువన గుంతలా ఏర్పడింది. తాజాగా, దీనిపై కీలక ప్రకటన చేసిన ఇస్రో.. ఈ ప్రక్రియను ‘ఎజెక్టా హాలో’ అని పిలుస్తారని తెలిపింది.   
లాండింగ్  సమయంలో ఉపరితలంపై సుమారు 2.6 టన్నుల పదార్థాన్ని విక్రమ్ తొలగించిందని, శివశక్తి సైట్ చుట్టూ 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉందని ఇస్రో శుక్రవారం తెలిపింది. ఈ దృగ్విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు సంగ్రహించి విశ్లేషించారు.  వారి పరిశోధనల ప్రకారం ల్యాండింగ్ సైట్ చుట్టూ 108.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు 2.06 టన్నుల చంద్ర ఎపిరెగోలిత్ (దుమ్ము, రాళ్లు) లేదా ఉపరితల పదార్థం బయటకు వచ్చింది.
2019లో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తుది మెట్టుపై విఫలం కావడంతో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా  సాయంతో ల్యాండింగ్‌కు ముందు, ఆ తర్వాత తీసిన హై-రిజల్యూషన్ ఫోటోలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.                                                                  
ల్యాండింగ్‌ ప్రక్రియకు కొద్ది గంటల ముందు.. అనంతరం ఫోటోలను సేకరించరు. ల్యాండర్ చుట్టూ ఉన్న ప్రకాశవంతమైన ప్రదేశం ఈ ‘ఎజెక్టా హాలో’లో కనిపిస్తుంది. ‘మ్యాప్ చేసి, వర్గీకరించిన పరస్పర సంబంధం లేని ‘ఎజెక్టా హాలో’ పిక్సెల్స్ నుంచి.. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కారణంగా స్థానభ్రంశం చెందిన లూనార్ ఎపిరెగోలిత్ ఎజెక్టా సుమారుగా 108.4 మీ2 వైశాల్యం కవర్ చేసినట్టు భావించాం.. వివిధ సంబంధాల ఆధారంగా ల్యాండింగ్ ప్రక్రియ సమయంలో సుమారు 2.06 టన్నుల చంద్ర ఎపిరెగోలిత్ బయటకు వెళ్లినట్టు మేము అంచనా వేస్తున్నాం’ అని ఇస్రో పేర్కొంది.
సేఫ్ ల్యాండింగ్ తర్వాత చంద్రుని ఉపరితలంపై రేగిన దుమ్ము, ధూళి క్రమేపీ సాధారణ స్థితికి చేరిన అనంతరం విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్‌ బయటకు వచ్చింది. ఇక, 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేసిన ల్యాండర్, రోవర్‌లను రాత్రి సమయం మొదలు కావడంతో సెప్టెంబరు 2, 4న ఇస్రో వాటిని నిద్రలోకి పంపింది. మళ్లీ అక్కడ సూర్యోదయం కావడంతో మేల్కొలిపే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
చేయాలని  ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.