చైనా మాజీ ప్ర‌ధాని లీ కియాంగ్ క‌న్నుమూత‌

చైనా మాజీ ప్రధానమంత్రి లీ కెకియాంగ్ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని చైనా అధికారిక మీడియా శుక్రవారం ప్రకటించింది. సంస్కరణల ఆలోచలు ఉన్న బ్యూరోక్రాట్‌గా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న లీ కెడియాంగ్ ఒకానొక సమయంలో చైనా భవిష్యత్తు నాయకుడిగా మారతాడని అంతా భావించారు. 

అయితే అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కారణంగా మరుగునపడిపోయారు. దాదాపు పదేళ్లపాటు అధ్యక్షుడు జిన్‌ పింగ్ హయాంలోనే ప్రధాన మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మావేశాల్లో లీని ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. 

లీ కియాంగ్‌ చైనా భ‌విష్య‌త్తు అధ్య‌క్షుడు అవుతార‌న్న ఊహాగానాలు ఓ ద‌శ‌లో వినిపించాయి. జీ జిన్‌పింగ్ గ్రూపుతో లీ సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్లే ఆయ‌న్ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. రిటైర్ అయ్యే వ‌ర‌కు చైనీస్ క‌మ్యూనిస్టు పార్టీలో ఆయ‌న రెండవ శ‌క్తివంత‌మైన నేత‌గా కొన‌సాగారు. ఈ తరానికి చెందిన స్మార్ట్ రాజ‌కీయ‌వేత్త‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉన్న‌ది.

లీ కియాంగ్ చాలా చిన్న కుటుంభం నుంచి వ‌చ‌చారు. ఆయ‌న ఓ స్థానిక అధికారి ఇంట్లో జ‌న్మించారు. 1955లో అనుహువై ప్రావిన్సులోని డింగ్‌యువాన్ కౌంటీలో పుట్టారు. అన్ని ద‌శ‌ల్లో ఆయ‌న ప‌నిచేశారు. చాలా చిన్న వ‌య‌సులోనే గ‌వ‌ర్న‌ర్‌గా ఎదిగారు. పోలిట్‌బ్యూరో స్టాండింగ్ క‌మిటీలో కూడా ఆయ‌న చిన్న‌వ‌య‌సులోనే చేరారు.

 మాజీ దేశాధ్య‌క్షుడు హు జింటావో స్థాయికి లీ కియాంగ్ చేరుకుంటార‌ని ఓ ద‌శ‌లో ఊహాగానాలు వినిపించాయి. హు జింటావో అండ‌దండ‌లు లీ కియాంగ్ కు ఉన్నాయ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యేయి. ఈ ఏడాది మార్చిలో ఆయ‌న పార్టీ నుంచి తొలిగే వ‌ర‌కు పొలిట్‌బ్యూరో స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు.

ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యమున్న ఆయన చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. యువతను ఉదారవాద భావనలవైపు ప్రోత్సహించేవారు. ఆర్ధిక విధానాల్లో లీ కియాంగ్ నిర్ణ‌యాలు చాలా సూక్ష్మంగా ఉండేవి. సంప‌న్నులు, పేద‌ల మ‌ధ్య దూరం తొల‌గించేందుకు ప్ర‌య‌త్నించారు. ప్ర‌తి ఒక్క‌రికీ గృహసౌక‌ర్యాన్ని క‌ల్పించడ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వాన్ని న‌డిపారు.

షాంఘైలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయ‌న‌కు గురువారం అక‌స్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారని, హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఆయన శ్వాస విడిచారని ఆ దేశ అధికార మీడియా ‘జిన్షూవా’ తెలిపింది.  ఆయన పార్టీ అధినేతగా ఉన్న సమయంలో హెనాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి చెందడం ఆయనకు పెద్ద కళంకంగా మిగిలిపోయింది. ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.