సింహపురి సాహిత్య భీష్ముడు అగస్త్య రెడ్డి వెంకురెడ్డి

సింహపురి సాహిత్య భీష్ముడు అగస్త్య రెడ్డి వెంకురెడ్డి అని వెంక రెడ్డి సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.  ఆయనకు `సింహపురి సాహిత్య భీష్ముడు’ బిరుదును మరణానంతరం ప్రకటించారు. నెల్లూరు నగరంలో ఏదేని పార్కుకు అగస్త్య రెడ్డి వెంకురెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించారు. 
 
సోమవారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో ఐదు దశాబ్దాల సాహితీ సేవకుడు, మూడు తరాల సాహితీ వారధి, నెల్లూరు ఆర్ఎల్ రెడ్డి టౌన్ హాల్ కార్యదర్శి గా వర్తమాన సమాజం అధ్యక్షులుగా పనిచేసిన ఆగస్త్య రెడ్డి వెంకురెడ్డి సంతాప సభలో పలువురు సాహితీ సేవకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
 
నెల్లూరు విఆర్ కళాశాల పూర్వ తెలుగు ప్రధానాచార్యులు మెట్టు రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా సింహపురిలో తెలుగు సాహితీ సేవలు వెంకురెడ్డి నిస్వార్ధంగా సేవ చేశారని గుర్తు చేశారు. తెలుగు భాషకి ప్రత్యేకమైన పలువురితొ  అష్టావధానాలను సింహపురి నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు. 
 
ఆలూరి శిరోమణి శర్మ మాట్లాడుతూ ఆయన రాసిన షాన్మాతుర శతకం  సాహిత్యాభిలాషులకు మరో తిక్కన పద్యాలు గుర్తుచేస్తున్నాయని చెప్పారు. లతీఫ్ కుట్టి మాట్లాడుతూ సాహిత్య పరంగా డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి నుంచి నేటితరం కవుల వరకు అందరికీ సాహిత్య వారధిగా పని చేశారని తెలిపారు.
 
 నెల్లూరు టౌన్ హాల్ లో జరిగిన ప్రతి సాహిత్య సేవా కార్యక్రమంతో వెంకురెడ్డికి అనుబంధం ఉందని పొన్నాల రామసుబ్బారెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా నెల్లూరు ఆర్ ఎల్ రెడ్డి టౌన్ హాలునెల్లూరు వర్ధమాన సమాజం నెల్లూరు కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సభలోసంతాప సందేశాల బ్రోచర్ ను  ఆవిష్కరించారు.
 
 రైతు నాయకుడు చిరసాని కోటిరెడ్డి, చెలంచర్ల భాస్కర్ రెడ్డి,  బి సురేంద్రనాథ్ రెడ్డి, చేజర్ల వినయ, బత్తిన  సాయి కుమార్ రెడ్డి, అగస్త్య రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు సాహితి నివాళులు అర్పించారు.