చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారంకు వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారంకు వాయిదా
 
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తరుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదలను వినిపించారు. 
 
విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు.  ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీం తెలింది.
భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.  ముఖ్యంగా సెక్షన్ 17ఏకు సంబంధించి గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు.
రఫేల్ కేసు ఆరోపణలపై 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పు ఇచ్చారని, చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారని కోర్టుకు తెలిపారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను హరీశ్ సాల్వే సుప్రీంకోర్టు ముందుంచారు.  అయితే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదని జస్టిస్ బోస్ చెప్పారు.
ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే వాదించారు. అసలు కేసులో ప్రజాప్రతినిధి భాగస్వామ్యం ఏంటని విచారణకు ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరి పేర్కొన్నారు.  2011 దేవిందర్ పాల్సింగ్ బుల్లర్ కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు. ఈ కేసు ప్రారంభమే చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలేవీ చట్టబద్ధం కావని బుల్లర్ కేసులో తీర్పు ఉందని చెప్పారు. కేసు ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
ఈ కేసు మూలంలోనే దోషం ఉంది కాబట్టి.. బుల్లర్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నానని సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్‍నే సవాల్ చేస్తున్నానని పేర్కొంటూ  అన్నింటిని కలిపేసి ఒక ఎఫ్ఎఆర్‍ను రూపొందించారని, దాన్నే తాను సవాల్ చేస్తున్నానని తెలిపారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఐఆర్ చట్టబద్ధం కాదని, ఎఫ్ఎస్ఐఆర్ చంద్రబాబు పేరు ఎక్కడా లేదని చెప్పారు.
 
చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు పూర్తి చేయగా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు చేస్తూ  జీఎస్టీ అధికారుల లేఖ ఆధారంగానే విచారణ చేపట్టినట్లు సీఐడీ డీజీ కోర్టు అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. 17ఏ ఈ కేసుకు వర్తించదననారు. ఈ పిటిషన్‍ను వెంటనే డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు. ఈ కేసు పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ సెక్షన్లకు సంబంధం ఉన్న కేసు అని చెప్పారు. పీసీ యాక్ట్ లేకపోతే ఏం జరుగుందని రోహత్గీని కోర్టు ప్రశ్నించారు.