క్రిమియాపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి

రష్యా ఆక్రమిత ప్రాంతంపై ఉక్రెయిన్‌ క్షిపణుల దాడికి పాల్పడింది. రష్యా ఆక్రమిత క్రిమియాపై గత కొంత కాలం నుంచి దాడుల తీవ్రతను పెంచుతూ వచ్చిన ఉక్రెయిన్‌ ప్పుడు ఏకంగా సెవెస్తపోల్‌లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణులను ప్రయోగించింది. 
 
ఒక క్షిపణి నేరుగా తాకడంతో ఈ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుందని క్రిమియా అధికారులు తెలిపారు.  ముందుగా ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించారని చెప్పిన నౌకాదళ అధికారులు తర్వాత తమ సిబ్బందిలో ఒకరు కనిపించడం లేదని పేర్కొన్నారు. కాగా, నౌకాదళ కేంద్రం మంటల్లో చిక్కుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఈ దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై చేస్తున్న నౌకాదళ దాడులను రష్యా మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచే పర్యవేక్షిస్తున్నది. కాగా, దాడిలో 9 మంది మృతి చెందడమేగాక, 16 మంది గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని రష్యా ఇంకా ధ్రువీకరించలేదు.

మరోవంక, ఉక్రెయిన్‌కు సుదీర్గ దూరం ప్ర‌యాణించే క్షిప‌ణుల‌ను అందించేందుకు అమెరికా సిద్ద‌మైంది. దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల్ని ఆ దేశం త‌యారు చేసింది. ఏటీఏసీఎంఎస్ క్షిప‌ణుల్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా ప్లాన్ చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు అమెరికా ఈ సాయం చేయ‌నున్న‌ది. 

ఏటీఏసీఎంఎస్(ఆర్మీ టాక్టిక‌ల్ మిస్సైల్ సిస్ట‌మ్‌ మిస్సైళ్లు సుమారు 300 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించే సామ‌ర్థ్యం ఉంటుంది. ఫ్రంట్‌లైన్ వ‌ద్ద నుంచి ర‌ష్యా భూభాగంలో దూరంగా ఉన్న టార్గెట్ల‌ను చేధించేందుకు ఆ మిస్సైళ్ల‌తో ఉక్రెయిన్‌కు సులువు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

శుక్ర‌వారం రోజున ర‌ష్యాలోని న‌ల్ల స‌ముద్రంలో ఉన్న నౌక‌ల‌ను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ ఓ మిస్సైల్‌ను వ‌దిలింది. సెవాస్తిపోల్‌పై స్టార్మ్ షాడో మిస్సైళ్ల‌తో దాడి జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాలు ఆ క్షిప‌ణుల్ని స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. ఆ మిస్సైళ్లు సుమారు 150 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల‌వు.