
ఆంధ్ర ప్రదేశ్ లోని మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమాల గుట్టును బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బహిర్గతం చేశారు. బీజేపీ మహిళా మోర్చా అధ్వర్యంలో మద్యం దుకాణాల ముట్టడి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా నరసాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర మద్యం సీసాలను పగలగొట్టారు.
నకిలీ మద్యం సరఫరా చేస్తున్నా సీఎం డౌన్ డౌన్ అంటూ దుకాణం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గుర్ర బల్ల సెంటర్లోని మద్యం దుకాణాన్ని సందర్శించి అమ్మక వివరాలపై ఆరా తీశారు. ఒక్కరోజులో ఇక్కడ రూ.1 లక్ష విలువైన సరుకును విక్రయిస్తే బిల్లు రూ.700కు మాత్రమే ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు సంబంధించి మద్యం దుకాణంలో ఉన్న వ్యక్తి నుంచి ఈరోజు వచ్చింది ఎంత? బిల్లులు ఇచ్చింది ఎంత? అని ఆరా తీశారు.
అనంతరం మద్యం సీసాలతో నిరసన తెలిపి, వాటిని ధ్వంసం చేశారు. ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతున్న చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మీనమేషాలు లెక్కిస్తున్నారని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు లక్ష రూపాయల విలువైన సరుకులు అమ్మితే బిల్లు ఇచ్చింది మాత్రం రూ.700 మాత్రమే అని ఆమె వెల్లడించాయిరు.
తాను కొన్ని రోజులుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇదే విషయం చెబుతున్నానని, ఇప్పుడు తాను చెప్పిన దానికి ఇది సజీవ సాక్ష్యమని ఆమె వెల్లడించారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు.
దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆమె ధ్వజమెత్తారు. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిందని ఆమె విమర్శించారు. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని పురందేశ్వరి డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అంతకు ముందు ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నకిలీ మద్యం సేవించి తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు. మద్యం నిషేధిస్తానంటూ అధికారంలోకి వచ్చిన ‘జగన్ గారు’ సరఫరా చేస్తున్న మద్యానికి ఆడబిడ్డల పుస్తెలు తెగుతున్నా
చలించడం లేదంటూ ఆమె ఎద్దేవా చేశారు.
చలించడం లేదంటూ ఆమె ఎద్దేవా చేశారు.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ