‘పాకిస్థాన్ ప్రధాని నేడు ఆ దేశానికి, ఈ దేశానికి తిరుగుతూ నిధుల కోసం అడుక్కుంటున్నారు. భారత్ మాత్రం అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. చంద్రుడిని చేరింది. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. భారత్ చేయగలిగింది పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతోంది? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు..?’ అని సూటిగా ప్రశ్నించారు.
అటల్ బిహారీ వాజపేయి ప్రధాని అయినప్పుడు భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం ఒక్క బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేదని నవాజ్ షరీఫ్ గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు భారత్ విదేశీ మారకం విలువ 600 బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన వివరించారు. భారత్ ఉన్నత స్థాయికి చేరితే పాక్ మాత్రం అడుక్కునే స్థితికి ఎందుకు చేరుకుంది..? అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులే కారణమని షరీఫ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Stories
ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలకు తిరస్కరించిన హెజ్జుల్లా
యూఏఈకు సరికొత్త రక్షణ కవచం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
పాక్ లో లష్కరే తోయిబా కీలక కమాండర్ అఫ్రిదీ కాల్చివేత