
కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది. అయిదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కెనడాలో ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ ను హత్య చేయించింది భారత్ అని ప్రధాని ట్రూడో ఆరోపణలను చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఆ ఆరోపణల నేపథ్యంలో కెనడాకు చెందిన హై కమీషనర్ కెమరూన్ మాకేకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఇవాళ ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాం కార్యాలయాన్ని సందర్శించారు. అయితే, భారత్ నుంచి వెళ్లిపోవాలన్న దౌత్యవేత్త ఎవరన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా భారత ఆంతరంగిక వ్యవహారాలలో కెనడా దౌత్యవేత్తలు జోక్యం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలలో వారి ప్రమేయం పట్ల భారత్ అభ్యంతరాలను ఈ చర్య వెల్లడి చేస్తుంది.
‘దీంతో కెనడా తెంపరితనానికి భారత్ గట్టి ప్రతిస్పందన ఇచ్చినట్టయ్యింది. భారత్‌లోని కెనడా హైకమీషనర్‌కు భారత ప్రభుత్వం మంగళవారం సమన్లు జారీచేసింది. సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. సంబంధిత దౌత్యవేత్త ఐదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. మన అంతర్గత వ్యవహరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కెనడా దౌత్యవేత్త జోక్యం ఎక్కువ కావడంతో భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
భారత్ కు చెందిన ఏజెంట్లే ఖలిస్తానీ నేత హర్దీప్‌ను కెనడా నేతలపై హత్య చేసినట్లు ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తను కూడా ఆ దేశం వెళ్లిపొమ్మన్నది.
More Stories
కైలాస మానససరోవర్ యాత్రకు వెబ్సైట్ ప్రారంభం
రక్షణ దళాల కదలికల ప్రసారాలపై కేంద్రం ఆంక్షలు!
కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు స్వాధీనం