పంజాబ్ లో కాంగ్రెస్ నేతను హతమార్చిన ఖలిస్థానీ

పంజాబ్‌ లో కాంగ్రెస్‌ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మోగా  జిల్లాకు చెందిన బల్జీందర్‌ సింగ్‌ బల్లీని కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోగా జిల్లాలో బల్జీందర్‌ సింగ్‌ ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కాల్చి చంపారు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
ఈ ఘటనలకు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. బల్జీందర్‌ను తామే హతమార్చామంటూ కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌ దల్లా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.  బల్జీందర్ సింగ్ బల్లి తనను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని ఆరోపించాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, ఇందుకు ప్రతీకారంగానే ఆయన్ని హతమార్చినట్లు వెల్లడించాడు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో అర్ష్ దల్లా పేరు కూడా ఉంది. అతని కోసం ఎన్‌ఐఏ గత కొన్ని రోజులుగా వెతుకుకోతంది. కాగా, అతడు గత మూడు, నాలుగేళ్లుగా కెనడా కేంద్రంగా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పంజాబ్‌లో పలు ఉగ్రహత్యల్లో అతడి ప్రమేయం కూడా ఉంది.