
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం 13 చోట్ల సంతకాలు చేశారని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయని చెబుతూ సాధారణంగా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్లాయని తెలిపారు. ఒక కార్పొరేషన్ నుంచి డబ్బు హవాలా రూపంలో ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిందని చెప్పారు.
సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధులు నిందితులుగా ఉన్నారని సంజయ్ తెలిపారు. గంటా సుబ్బారావుకు మూడు పదవులు ఇచ్చారని చెబుతూ పై స్థాయిలో ప్రోద్బలం తోనే అన్నీ జరిగాయని ఆరోపించారు. జీవోలో పొందుపరిచిన అంశాలకు భిన్నంగా అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు.
అగ్రిమెంట్ లో రూ. 330 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పడం వెనుక దుర్భుద్ధి కనపడుతుందని పేర్కొంటూ తమకు 58.8 కోట్లు మాత్రమే అందాయని సీమెన్స్ సంస్థ స్పష్టత ఇచ్చిందని సంజయ్ వెల్లడించారు. మొత్తం రూ. 313 కోట్లలో రూ. 241 కోట్లు ఎలాంటి సంబంధం లేని షెల్ కంపెనీకి వెళ్లాయని సంజయ్ తెలిపారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటు కు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
రూ. 58 కోట్లతో కొనుగోలు చేసి రూ. 2800 కోట్లు గా చూపించారని సంజయ్ ఆరోపించారు. గుజరాత్ లో 85-15 శాతం మోడల్ లో ఒప్పందాలు జరిగాయని, గుజరాత్ లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారని చెబుతూ ఏపీలో రూ. 2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందని చెప్పారు.
సీఐడీ ఆరోపించిన సుమన్ బోస్ , వికాస్ ఖన్వేల్కర్ లను ఈడీ అరెస్టు చేసిందని సంజయ్ గుర్తు చేశారు. డిజైన్ టెక్ కు చెందిన రూ. 32 కోట్లు ఈడి సీజ్ చేసిందని చెప్పారు. టీడీపీకి చెందిన జే.వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సీఏ గా నియమించారని తెలిపారు. బడ్జెట్ అనుమతి తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాల పై చంద్రబాబు సంతకాలు చేశారని స్పష్టం చేశారు. జీవో లో 90 – 10 శాతం వాటాలను పేర్కొన్నారని, కానీ ఒప్పందంలో లేదని వెల్లడించారు.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు