చంద్రుడిపై నివాసంపై మార్గం సుగమం చేసిన చంద్రయాన్‌ మిషన్లు

ఇస్రో చేపట్టిన మూడు చంద్రయాన్‌ మిషన్లు ఊహించినదాని కంటే ఎక్కువగానే సమాచారాన్ని అందజేశాయని, భవిష్యత్‌లో చంద్రుడిపై మానవ నివాసం ఏర్పాటు, పలు కోణాల్లో చంద్రుడిపై అన్వేషణకు మార్గం సుగమం చేశాయని ప్రముఖ శాస్త్రవేత్త దేబీ ప్రసాద్‌ దువారీ చేపట్టారు. తాజాగా ఇస్రో  చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం కావడం, విక్రయ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని గుర్తు చేశారు. 

ప్రజ్ఞాన్‌ రోవర్‌ సైతం జాబిల్లిపై తిరుగుతూ అమూల్యమైన డేటాను యావత్‌ ప్రపంచానికి అందించిందని పేర్కొంటూ ఈ డేటా భవిష్యత్‌లో మానవ నివాసంతో పాటు చంద్రుడిపై అనేక పరిశోధనలకు మార్గం సుగమం చేసిందని తెలిపారు.  ఈ మూడు మిషన్లు నీటి మంచు, గతంలో గుర్తించని, ఖనిజాలు, మూలకాల ఉనికితో పాటు చంద్రునిపై ఉష్ణోగ్రత మార్పులను గుర్తించాయని పేర్కొన్నారు. 

2019లో చేపట్టిన చంద్రయాన్-1 మినరాలజీ మ్యాపర్‌ను ఉపయోగించి ధ్రువ ప్రాంతంలో 60వేల కోట్ల లీటర్ల నీరు మంచు రూపంలో తొలిసారిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ డేటాతో మానవులు ఉండగలిగే సింథటిక్ బయోస్పియర్‌ను సృష్టించవచ్చని దేబీ ప్రసాద్‌ చెప్పారు. అయితే, చంద్రయాన్‌-2లో ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో విఫలమైందని గుర్తు చేశారు. 

అయినప్పటికీ ఆర్బిటర్‌ నాలుగు సంవత్సరాల పాటు చంద్రుని క్షక్షలో తిరుగుతూ కావాల్సినంత డేటా, చిత్రాలను భూమికి పంపిందని వెల్లడించాయిరు. చంద్రయాన్‌-3లో ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన కొద్దిరోజుల్లోనే సల్ఫర్‌ ఉనికిని గుర్తించి, డేటాను అందజేసిందని తెలిపారు.  గతంలో ఇంత వరకు కనుగొనని ఖనిజాలు, మూలకాలకు సంబంధించి ఈ డేటాతో పాటు ఇంకా తెలియని ఇతర ఖనిజాలు, మూలకాలకు సంబంధించి అనేక అవకాశాలను సూచిస్తుందని చెప్పారు. అలాగే చంద్రుడి ఉష్ణోగ్రతలపై ఆసక్తికరమైన డేటాను అందించిందని వెల్లడించారు. 

అయితే, చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉండగా, చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను నమోదు చేసిందని వివరించారు. ఈ డేటా చంద్రుని ఉపరితలం మానవ నివాస యోగానికి సానుకూలంగా సూచిస్తుందని పేర్కొన్నారు. 

అలాగే ఇస్రో చేపడుతున్న గగన్‌యాన్‌పై దువారీ స్పందిస్తూ మిషన్‌లో భాగంగా భూమికి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపి.. తిరిగి సురక్షితంగా భూమికి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.  ఇస్రో గగన్‌యాన్‌ ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2024 ప్రారంభంలో చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే, మొదట రెండింటిలో హ్యుమనాయిడ్‌ రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపనుందని తెలిపారు. 

దీంతో అంతరిక్ష నౌకలో మానవ శరీరానికి ఎదురయ్యే సవాళ్లను గుర్తిస్తుందని, ఆ తర్వాత మిషన్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుందని చెప్పారు. ఈ స్థాయిలో నైపుణ్యం, సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారని తెలిపారు. శాస్త్రవేత్త దేబీ ప్రసాద్‌ దువారీకి గత రెండు దశాబ్దాలకుపైగా కోల్‌కతాలోని బిర్లా ప్లానిటోరియంతో ఆయనకు అనుబంధం ఉన్నది.