భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ 30 వేల వీసాలు

2030 నాటికి భారత్‌ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ  పరిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత, భారతదేశంలోని ఫ్రెంచ్‌ రాయబార కార్యాలయం ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్‌-స్కెంజెన్‌ వీసాతో సహా అనేక చర్యలను రూపొందించింది.

మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదేశాల మేరకు ఆ దేశ రాయబార కార్యాలయం కార్యాచరణ ప్రారంభించింది. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన షెంజెన్ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఈ చర్య ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయని ఆకాంక్షిస్తోంది. ఇందులో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరిచే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్‌ భాష, ఇతర విద్యా విభాగాలలో సమగ్ర శిక్షణను అందించే ప్రత్యేక కార్యక్రమం ”అంతర్జాతీయ తరగతులను” సృష్టిస్తుందని రాయబార కార్యాలయం తెలిపింది.

భారతీయ విద్యార్థుల కోసం ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ క్లాసెస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఫ్రెంచి భాష, ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. త్వరలో ఫ్రెంచ్ రాయబార కార్యాలయం చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనుంది. 

అక్టోబర్ నెలలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. 40 కి పైగా ఫ్రెంచ్ ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు వీటికి హాజరు కానున్నారు. “ఫ్రాన్స్‌ ఎల్లప్పుడూ మీ స్నేహితుడిగా ఉంటుంది. మీరు మా దేశంలో అద్భుతమైన విద్యాసంబంధమైన జీవితానుభవాన్ని కలిగి ఉండేలా మేము చేయగలిగినదంతా చేస్తాము” అని భారతదేశంలోని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ తెలిపారు.