అవినీతి ఆరోపణలలో కేరళ సీఎం విజయన్ కుమార్తె  వీణా!

ఫిబ్రవరి 9 న, కొత్త ఇంధన సెస్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చివరిసారిగా మీడియా సమావేశంలో పాల్గొని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కీలకమైన ఓ అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటు ఉండడంతో ఆ తర్వాత మీడియా ముందుకు రాలేకపోతున్నారు. ఈ కుంభకోణంలో ఆయన కుటుంభం సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తుండటం, ఆయన మౌనంగా ఉంటూ ఉండడంతో సిపిఎం నాయకులు ఇరకాట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 
ఇల్మనైట్‌ను సింథటిక్ రూటిల్, ఫెర్రిక్ క్లోరైడ్‌గా మార్చే డొమైన్‌లో పనిచేస్తున్న వివాదాస్పద కంపెనీ అయిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సిఎంఆర్ఎల్) “బోగస్ క్లెయిమ్‌ల” కింద సీఎం కుమార్తె వీణా తైకండియిల్ కు రూ. 1.72 కోట్లు చెల్లించిందని మలయాళ మనోరమ ఆగస్టు 8న ప్రకటించడంతో వివాదం మొదలైంది.  జూన్ 12న ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్,డు న్యూఢిల్లీ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కథనం వెలువడింది.
 
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఒరాకిల్ మాజీ ఉద్యోగి అయిన వీణా 2012లో తిరువనంతపురంలోని ఆర్ పి  టెక్‌సాఫ్ట్ ఇంటర్నేషనల్‌లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆమె మొదటి సారిగా రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఐటి కంపెనీ మలయాళీ బిలియనీర్ రవి పిళ్ళైకి చెందిన మధ్యప్రాచ్యం ఆధారిత ఆర్ పి గ్రూప్‌తో అనుబంధంగా ఉంది.
 
2014లో, ఆమె ఈ కంపెనీకి రాజీనామా చేసిన తర్వాత తన సొంత యాజమాన్యంలోని కంపెనీ ఎక్సాలాజిక్‌ను స్థాపించింది. వీణా వివాదాలలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, కేరళ బంగారు స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్న సురేష్  స్ప్రింక్లర్ కుంభకోణం వెనుక వీణా “మాస్టర్ మైండ్” ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
ఆమె కేరళ ప్రభుత్వపు డేటాను అమెరికన్ సంస్థ స్ప్రింక్లర్ కు వారి అనుమతి లేకుండా పంచుకోవడం ద్వారా  క్వారంటైన్‌లో ఉన్న 1.75 లక్షల మంది వ్యక్తుల గోప్యతను ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన ఇ-మొబిలిటీ ప్రాజెక్టు కన్సల్టెన్సీని అవినీతి పద్ధతిలో మంజూరు చేసిందన్న ఆరోపణలకు వీణా పేరును కూడా ప్రతిపక్షాలు ముడిపెట్టాయి.
 
సిఎంఆర్ఎల్ కు ఎలాంటి సేవలు అందించకపోయినప్పటికీ, 2017 నుండి 2020 మధ్య కేరళ టూరిజం మంత్రి ముహమ్మద్ రియాస్ భార్య వీణా ఆ కంపెనీ నుండి రూ. 1.72 కోట్లు పొందినట్లు ఐటీ మధ్యంతర పరిష్కార బోర్డు వెల్లడించడంతో తాజా వివాదం కేరళ రాజకీయాలలో కలకలం రేపుతోంది. ఈ తీర్పుకు దారితీసిన సంఘటనలు జనవరి 2019లో  సిఎంఆర్ఎల్  పత్రాలను ధృవీకరించడానికి ఐటి విభాగం ఒక పెద్ద దాడిని నిర్వహించడం ప్రారంభించింది. 2013-14 నుండి 2019-2020 మధ్య కాలంలో సిఎంఆర్ఎల్ పన్ను చెల్లింపులను పరిశీలించడం ద్వారా ఈ దాడులు జరిపారు. 
 
ఈ సందర్భంగా, కంపెనీ ఖాతా పుస్తకాలలో అనేక వ్యత్యాసాలను,  పెరిగిన ఖర్చులను గుర్తించారు. ఆసక్తికరంగా, నవంబర్ 2020లో కంపెనీ ఎండి ఎస్ ఎన్ శశిధరన్ కర్తా,  సిఎంఆర్ఎల్  పన్నుల వ్యత్యాసాల పరిష్కారం కోసం ఆదాయపన్ను శాఖను అభ్యర్ధించారు. విచారణ సమయంలో,  సిఎంఆర్ఎల్ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ, ముస్లిం లీగ్ నాయకుడు పి.కె.తో సహా పలువురు రాజకీయ నాయకులకు కోట్లలో గణనీయమైన నగదు చెల్లింపులు చేసిందని వెల్లడైంది.
 
 కంపెనీ జనరల్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్  కున్హాలికుట్టి ఐటి అధికారులకు ఈ చెల్లింపుల ఉద్దేశ్యాన్ని ఈ క్రింది విధంగా వివరించాడు: “మా వ్యాపారం సజావుగా సాగడం కోసం ఈ చెల్లింపులు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు/సభ్యులు, మీడియా సంస్థలు, పోలీసులు మొదలైన వారికి చేయడం జరిగింది”.
 
“మేము మా ముడిసరుకుగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి తవ్విన ఇల్మెనైట్‌ను పొందుతాము. ఈ ఇన్-టర్న్ పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంది. దాని కారణంగా మా వ్యాపారాన్ని అడ్డుకోవడానికి లేదా మా రోజువారీ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి మేము పెద్ద సంఖ్యలో బెదిరింపులను ఎదుర్కొంటుంటాము. ఈ బెదిరింపులను అధిగమించడానికి, సహకారాన్ని పొందడానికి వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్ర పోలీసులు, మీడియా సంస్థల సభ్యులు/కార్యకర్తలకు మేము అనేక చెల్లింపులు చేస్తాము”.
 
సిఎంఆర్ఎల్   కార్పొరేట్ కార్యాలయంలో ఆదాయ పన్ను అధికారులు జరిపిన సోదాలలో సిఎంఆర్ఎల్, వీణాకు చెందిన ఎక్సలోజిక్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మార్చి 2, 2017 నాటి సేవా ఒప్పందం ప్రతి కనుగొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, వీణా కంపెనీకి, సిఎంఆర్ఎల్  కార్పొరేట్ కార్యాలయం కోసం ఐటి సేవలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను అప్పగించారు.
 
ఎక్సాలాజిక్‌కు నెలవారీ రూ.3 లక్షల చెల్లించే విధంగా పోపండం పేర్కొంది. ఆసక్తికర అంశం ఏమిటంటే ఆదాయపన్ను అధికారుల సోదాలలో సిఎంఆర్ఎల్  లో ఉపయోగిస్తున్న ఏకైక సాఫ్ట్‌వేర్ అవుట్ లుక్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, పవర్ బిల్డర్ మాత్రమే. వీటిని కంపెనీ అంతర్గత ఐటీ  బృందం నిర్వహిస్తున్నది.  ఈ సోదాలలో డిసెంబర్ 2016 నాటి మరో ముఖ్యమైన లేఖను కనుగొన్నారు. దీని ప్రకారం సిఎంఆర్ఎల్   జనవరి 1, 2017 నుండి వీణాను రిటైనర్‌షిప్ ప్రాతిపదికన “మార్కెటింగ్, ఐటి కన్సల్టెంట్‌గా” నియమించింది. ఆ లేఖలో ఈ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ వీణా సంతకం ఉంది.
 
ఈ సోదాల సందర్భంగా వీణా అందిస్తున్న సేవలపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కర్త సహా కంపెనీ ఉన్నతాధికారులను ప్రశ్నించగా ఆమె ద్వారా కంపెనీకి ఎలాంటి ఐటీ సేవలు అందిస్తున్నట్లు తమకు తెలియదని స్పష్టం చేశారు.  ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి విజయం స్పందించక పోయినప్పటికీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఆగస్టు 10న వీణా, సిఎంఆర్‌ఎల్‌ల మధ్య జరిగిన లావాదేవీలను సమర్థించింది. సిఎంఆర్‌ఎల్‌, ఎక్సాలాజిక్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పారదర్శకంగా పేర్కొంటూ వెనుకవేసుకు వచ్చింది.
 
ఒకేసారి కేరళలో సీపీఎం నాయకత్వం పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మధ్యనే త్రిస్సూర్‌లోని కరువనూరు సహకార బ్యాంకులో రూ.125.83 కోట్ల కుంభకోణంలో మాజీ మంత్రి, సీపీఎం ఎమ్మెల్యే ఏసీ మొయిదీన్‌కు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన నివాసంలో 22 గంటల పాటు దాడులు నిర్వహించింది.