వారం ముందే అమర్‌నాథ్‌ యాత్ర ముగింపు!

అమర్‌నాథ్‌ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది.  అమర్ నాథ్ యాత్ర ఆగస్టు 23 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తగ్గిన యాత్రికుల సంఖ్య, ట్రాక్ పునరుద్దరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
 
“యాత్రికుల ప్రవాహం గణనీయంగా తగ్గడం, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపడుతున్న దుర్బల ప్రాంతాలలో యాత్రా ట్రాక్‌ల అత్యవసర మరమ్మతులు, నిర్వహణ కారణంగా, పవిత్ర స్థలానికి దారితీసే రెండు ట్రాక్‌లలో యాత్రికుల కదలికలు ఉన్నాయని పుణ్యక్షేత్రం బోర్డు అధికారులు తెలియజేసారు. అందువల్ల 23 ఆగస్టు, 2023 నుంచి రెండు మార్గాల నుంచి యాత్ర తాత్కాలికంగా నిలిపివేశాము” అని ఓ ప్రకటనలో  పేర్కొన్నారు.
 
చదీ ముబారక్ సాంప్రదాయ పహల్గామ్ మార్గంలో ఆగస్టు 31న యాత్ర 2023 ముగింపు పలకనున్నారు. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై ఆగస్టు 31న చాడీ ముబారక్ కార్యక్రమంతో ముగుస్తుంది. యాత్ర రెండు మార్గాల నుంచి ఏకకాలంలో ప్రారంభమైంది.
 
అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ నుంచి యాత్ర మొదలవుతోంది. ఈ సంవత్సరం యాత్రకు ఇప్పటి వరకు 4.4 లక్షల మందికి పైగా యాత్రికులు పవిత్ర అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రంలో శిలాకారంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. ఈ అమర్ నాథ్ యాత్ర క్లిష్టంగా ఉంటుంది.
అమర్ నాథ్ యాత్రకు కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా నిలిపి వేశారు. వర్షాలు, వరదలు కొండ చరియలు విరిగి పడటంతో యాత్రను నిలిపివేశారు. ఆ తర్వాత పున ప్రారంభించారు. అమర్ నాథ్ యాత్ర చేసే వారు ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే ఈ యాత్ర ఎత్తైన ప్రదేశంలో కొనసాగుతోంది. కొన్నిసార్లు అక్కడ ఆక్సిజన్ సమస్య కూడా ఏర్పడుతుంది.
అందుకే అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారు ఆరోగ్యంగా ఉండాలని చెబుతుంటారు. ఈ ఏడాది దర్శనకాలాన్ని 62 రోజుల పాటు దీర్ఘకాలం ఉంచినా, యాత్ర ప్రారంభమైన రెండు వారాల తర్వాత నుంచి భక్తుల రాక తగ్గుముఖం పట్టింది.