పలు దేశాల స్వతంత్ర పోరాటాలకు స్ఫూర్తి నేతాజీ 

* అదృశ్యమైన రోజు సందర్భంగా నివాళి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం పోరాటాల మాయం. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వలస పాలకులపై యుద్ధ భూమి నుండి నేరుగా పోరాడిన ఏకైక నేత. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో,  సాధారణ ప్రయాణికులకు క్షేమకరం కానీ ప్రమాదకర పరిస్థితులు ఉన్న తరుణంలో వివిధ దేశాల్లలో సాహసోపేత పర్యటనలు జరిపి, భారత దేశ స్వాతంత్య్రం కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసిన సహస యోధుడు. 
 
బహుశా ప్రపంచ చరిత్రలో ఆయనతో పోల్చదగిన యోధుడు మరొకరు ఉండరు. బ్రిటిష్ వారి నుండి భారత్ ను విముక్తి చేస్తున్నట్లు ప్రకటించి, జాతీయ ప్రభుత్వాన్ని ప్రకటించిన  యోధుడు. రెండు ప్రపంచ యుద్ధంలో తన నాయకత్వంలోని సేనలు విజయం సాధించినప్పటికీ, భారతదేశంలో స్వాతంత్ర పోరాటం అంత ఉధృతంగా లేకపోయినప్పటికీ, భారత్ లో ఇక ఉండడం క్షేమకరం కాదని వారిలో భయాన్ని కలిగించిన అద్భుతమైన నేత. 
ఆయన ఉత్తేజభరితమైన నాయకత్వం కేవలం భారత దేశంకే కాదు  ,పసిఫిక్ లో సుమారు 60 దేశాలు దాదాపు ఒకే సమయంలో స్వతంత్రం పొందడానికి స్ఫూర్తి ఇచ్చారు.  నేతాజీ పిలుపుతో వేలాది మంది తమ యువకులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. క్షణికావేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైన్యాన్ని సృష్టించాడు.
నేతాజీ 1897లో ఒడిశాలోని కటక్‌లో జన్మించారు. కోల్‌కతా నుండి పట్టభద్రుడయ్యారు.  ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసిఎస్) అధికారి కావడం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నారు. కానీ అతను తన ఉద్యోగంతో వచ్చిన సౌకర్యాలు, హోదాతో  కూడిన జీవితానికి అలవాటుపడలేదు.  స్వాతంత్య్ర ఉద్యమాన్ని మనస్పూర్తిగా స్వీకరించడమే కాకుండా, తన వ్యక్తిగత సౌఖ్యాలు, కుటుంభం బాంధవ్యాలను కూడా వదులుకున్నారు. 
“నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అనే నినాదంతో దేశ ప్రజలను జాగృతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఆయన  దార్శనికత,  వ్యక్తిత్వం తేజస్సు అటువంటిది. అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొంది, ప్రజలకు.  “నేతాజీ” గా ఆరాధ్యదైవంగా మారారు.

ఆయనకు భారత మాత అంటే ఎంత అభిమానం అంటే తన దేశం బానిసత్వపు సంకెళ్లతో బంధించి ఉండగా తానెట్లాగు ప్రశాంతంగా జీవించగలనని అంటూ తీవ్ర అసహనానికి గురయి,  భారతదేశ సరిహద్దులు దాటి, బ్రిటిష్ పాలకులపై యుద్దాన్ని నిర్భయంగా ప్రకటించారు. దేశ సరిహద్దులకు చాలా దూరంగా ఉన్నప్పటికీ ప్రజల మనస్సులకు మాత్రం దూరం కాలేదు.

ఆయనకు కీలకమైన దేశాల దేశాధినేతలు ఆయనకు అండగా నిలిచారు.  నేతాజీ భారతదేశ తీరాన్ని దాటి స్వాతంత్య్ర  పోరాట జ్యోతిని వెలిగించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ)పేరుతో యుద్దభూమిలోకి ఒక సైన్యంతో దిగి బ్రిటిష్ పాలకులకు నిద్రను కరువు చేశారు.  `డిల్లీ చలో’ నినాదాన్ని అందించారు. ఆయన నిర్మించిన  60,000 మంది సైన్యంలోని వేలాది మంది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.

“విజయం ఎల్లప్పుడూ వైఫల్యాల స్తంభంపై నిలుస్తుంది” అనే జీవిత సత్యం ఆయనను ప్రభావితం చేసింది. అందుకనే తాత్కాలిక అపజయాలతో ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు. తన స్వాతంత్య్ర కాంక్ష నుండి వెనుకడుగు వేయలేదు. నేతాజీ అనేక సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నారు, కానీ ఆ వైఫల్యాలనే  ఆయన తన పోరాటంతో విజయంగా మార్చుకున్నారు. 
మునిసిపల్ రాజకీయాలైనా, సాధారణ కాంగ్రెస్‌వాది నుండి కాంగ్రెస్ అధ్యక్షుడి స్థానానికి ప్రయాణం అయినా, ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు అయినా లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం అయినా, ఆయన  ప్రతి పరీక్షలో విభిన్నంగా ఉత్తీర్ణత సాధించారు. బోస్ మహాత్మా గాంధీ నాయకత్వాన్ని అంగీకరించారు, అయితే విచిత్రం ఏమిటంటే ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టడానికి గాంధీజీయే కారణం అయ్యారు. 
 
ఆ నాడు భారత స్వాతంత్య్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ నిలబెట్టిన అభ్యర్థిపై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేసి, గెలుపొందడం సాధారణ విషయం కాదు. అది ఆయన పట్టుదలను, సాధారణ ప్రజలలో – ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలలో ఆయన నాయకత్వం పట్ల గల నమ్మకాన్ని వెల్లడి చేస్తుంది. 
 
అంత మాత్రం చేత ఆయన ఎన్నడూ గాంధీజీ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదు. గాంధీ సహితం నేతాజీ పట్ల అభిమానంగానే ఉండేవారు.  
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రధాన మంత్రి. అతను 1956లో కోల్‌కతాకు వచ్చాడు.  ఆ సమయంలో, అతనికి ఆతిధ్యం ఇచ్చిన గవర్నర్,  మాజీ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిబి  చక్రవర్తి  భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని  బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటో  అతని నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 
 
అట్లీ స్పందిస్తూ, బోస్ స్థాపించిన  ఆజాద్ హింద్ ఫౌజ్  సైనిక కార్యకలాపాలు ఒక వంక పెరుగుతూ ఉండటం, మరోవంక,  బ్రిటిష్ రాజ్యానికి భారత సైన్యం,   నావికాదళం విధేయత తగ్గుపోతూ ఉండడమే ప్రధాన కారణం అని స్పష్టం చేశారు. అంటే అప్పటికి జీవించి ఉన్నారో లేదో కూడా తెలియని నేతాజీ గురించిన భయంతోనే వారు భారత్ ను వదిలి వెళ్లారని స్పష్టం అవుతుంది. 
 
ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌సి మజుందార్ రాసిన “ఎ హిస్టరీ ఆఫ్ బెంగాల్” పుస్తకంలో జస్టిస్ చక్రవర్తి పబ్లిషర్‌కు రాసిన లేఖ గురించిన ఈ ప్రస్తావన ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నేతాజీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించింది. నర్మదా తీరం అతని జీవితాన్ని మార్చేసింది. త్రిపుర కాంగ్రెస్ సమావేశం మార్చి 4-11, 1939 వరకు జబల్‌పూర్‌లో జరిగింది.
 
ఆరోగ్యం బాగాలేకపోయినా నేతాజీ ఇందులో పాల్గొనేందుకు స్ట్రెచర్‌పై వచ్చారు. ఆ తర్వాత, ఫార్వర్డ్ బ్లాక్‌ని ఏర్పాటు చేసేందుకు జూలై 4, 1939న మళ్లీ జబల్‌పూర్‌కు వచ్చారు. నేతాజీతో మధ్యప్రదేశ్ ప్రజలకు లోతైన అనుబంధం ఉంది. రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో, ఆయన పేరు మీద ఒక వార్డు ఉంది. 
 
సుభాష్ చంద్రబోస్ తన సహచరులకు ఇచ్చిన సందేశం: “విజయం దూరం కావచ్చు, కానీ అది అత్యవసరం”.  భారత నాయకత్వానికి ప్రపంచ గుర్తింపును అందించిన ఘనత బోస్‌దే. అంతకుముందు, స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక,   సాంస్కృతిక ఔన్నత్యం గురించిన అవగాహనలో  ప్రపంచానికి జ్ఞానోదయం చేశారు. నేతాజీ భారతీయుల పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించారు. 
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి భగవద్గీత గొప్ప ప్రేరణ అని సుభాష్ చంద్రబోస్ విశ్వసించారు. సార్వత్రికతపై స్వామి వివేకానంద బోధనలు, ఆయన వ్యక్తపరచిన  జాతీయవాద ఆలోచనలు, సామాజిక సేవ,  సంస్కరణలపై ధృడమైన విశ్వాసాలు అన్నినేతాజీని చిన్నతనం నుండి విశేషంగా  ప్రేరేపించాయి.

కొంతమంది రచయితలు హిందూ ఆధ్యాత్మికత నేతాజీ రాజకీయ,  సామాజిక ఆలోచనలో ఒక ముఖ్యమైన భాగంగా   భావిస్తున్నారు. చరిత్రకారుడు లియోనార్డ్ గోర్డాన్ వివరించినట్లుగా, “అంతర్గత మతపరమైన అన్వేషణలు అతని వయోజన జీవితంలో ఒక భాగంగా కొనసాగాయి. ఇది అతనిని భారత భూదృశ్యాన్ని చుట్టుముట్టిన నెమ్మదిగా పెరుగుతున్న నాస్తిక సోషలిస్టులు,  కమ్యూనిస్టుల నుండి వేరు చేసింది.”

1930లో కలకత్తాలో చేసిన ప్రసంగంలో బోస్ “ఆధునిక ఐరోపాలో సోషలిజం,  ఫాసిజం అని పిలిచే వాటి ప్రభావం”ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.  తర్వాత బోస్ కమ్యూనిజం, ఫాసిజం మధ్య “మధ్య మార్గం లేదు” అంటూ నెహ్రూ  1933లో చేసిన ప్రకటనను “ప్రాథమికంగా తప్పు” అని అభివర్ణించాడు.  “జాతీయవాదం,  మతాన్ని తిరస్కరించడం వల్ల భారతదేశంలో కమ్యూనిజం ప్రాబల్యం పొందలేకపోవచ్చని  బోస్ విశ్వసించారు.