లవ్ జిహాద్ కు ప్రేరేపిస్తున్నజోగులాంబ ఆలయ అధికారి

పరమ పవిత్రమైన శక్తి స్వరూపిణి అలంపూర్ జోగులాంబ తల్లి సాక్షిగా లవ్ జిహాద్ రాక్షస క్రీడ సాగుతోంది. దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రంగనాథ్ అనే ప్రభుత్వ ఉద్యోగి లవ్ జిహాద్ కు యువతులను ప్రేరేపిస్తున్నాడని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా పంచాయతీ చేసి పంపించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. వెంటనే అతడిని సస్పెండ్ చేసి, ఎన్ఐఎ తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.
 
ఆలయానికి వచ్చే ప్రముఖ భక్తుల వివరాలు నమోదు చేసుకోవడం, వారి పుట్టిన తేదీ, నక్షత్రం, అడ్రస్ సేకరించి నిరంతరం వారికి అందుబాటులో ఉండడం, వారి పేర అర్చనలు చేస్తూ పూజలు చేస్తున్నట్టు ప్రసాదాలు పంపడం, దండిగా డబ్బులు రాబడుతున్న సీనియర్ అసిస్టెంట్ ముస్లింలుతో స్నేహం చేస్తూ హిందూ యువతులను వారికి అంటగడుతున్నట్లు ఆరోపించింది. 
ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నా వెలుగు చూడకపోగా తాజాగా భాగ్యనగర్ లో  పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో అక్కడే ఓ ముస్లిం యువకుడు హిందువుగా నటిస్తూ  అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించిన ఉదంతంలో అడ్డంగా దొరికిపోయాడు. అతను ముస్లిం అని తెలుసుకున్న అమ్మాయి సదరు వ్యక్తిని దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో హైదరాబాదులో ఉంటున్న అతను రంగనాథ్ సహాయం కోరాడు.
 
అతడిని పంచె కట్టుకొని, బొట్టు పెట్టుకొని హిందూ భక్తుడిగా దేవాలయానికి ఆలయంలో దర్శించుకోనేటట్లు చేసే, హిందువేనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆలయానికీ వచ్చే భక్తుడి కుమార్తెకు ఫోన్ చేసి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోమని సూచించడంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. గద్వాల్ ఎస్పీ స్పందించి కేసు నమోదు చేయాలని అలంపూర్ ఇన్స్పెక్టర్ కు సూచించారు.
ఈ క్రమంలో అలంపూర్ పోలీసులు రంగనాథ్ ను పిలిచి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వివరాలు స్వీకరించే సమయంలో తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు.. ఇకమీదట ఇలాంటి తప్పు చేయనని లిఖితపూర్వకంగా  ఇన్స్పెక్టర్ గారికి రాసి ఇచ్చారు.  కానీ తప్పు చేశానని ఒప్పుకుని లిఖితపూర్వకంగా రాసిచ్చినా నిందితుడిపై కేసు మాత్రం నమోదు చేయకపోవడం గమనార్హం.
దీంతో  విశ్వహిందూ పరిషత్ రంగంలోకి దిగింది. రంగనాథ్ గతంలో చేసిన అన్ని తప్పులను, అతడి వివరాలను గోప్యంగా సేకరించింది. అన్ని ఆధారాలు స్వీకరించాక ఎండోమెంట్ కమిషనర్ అనిల్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి ,  స్థానిక ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డిలతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు.
 
ఎంగేజ్మెంట్ కుదిరిన హిందూ అమ్మాయిని  అప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న ముస్లిం అబ్బాయితో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్న రంగనాథ్ పై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేసింది.  భాగ్యనగర్ లో పనిచేస్తున్న ఆ ముస్లిం యువకుడికి ఎక్కడో అలంపూర్ లో పనిచేస్తున్న రంగనాథ్ అనే ప్రభుత్వ ఉద్యోగికి లింకు ఎలా కలిసింది?  
 
వారి మధ్య ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి? ఏకంగా పెళ్లి చేసుకోవాలని హుకుం చేసేటంత ధైర్యం ఎక్కడిది? ఇవన్నీ పరిశీలిస్తే రంగనాథ్ అనే ప్రభుత్వ ఉద్యోగికి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. 
 
అలంపూర్ వాస్తవ్యులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎన్ఐఏ కూడా జోక్యం చేసుకోవాలని పరిషత్ డిమాండ్ చేసింది.  హిందూ యువతులను మతం మార్చి, పెళ్లి చేసుకుని ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నటువంటి సంఘటనలుగా అనేకం ఉన్నాయని గుర్తు చేసింది.  అందులో భాగంగానే ఇప్పటికే ఎంతమందిని లవ్ జిహాద్ కు ప్రేరేపించాడు? అనే వివరాలు సేకరించ అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పరిషత్ డిమాండ్ చేసింది. 
 
విచ్చలవిడిగా హిందూ భక్తుల నుంచి డబ్బులు సేకరించి ముస్లిం యువకులకు, హిందూ వ్యతిరేక విధానాలకు ఖర్చు పెట్టడం చూస్తుంటే భారీ స్థాయిలో కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతుందని పేర్కొంటూ లోతైన దర్యాప్తు అవసరమని పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్ డిమాండ్  చేశారు.