
జాతీయ వైద్య సంఘం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ (ఎన్‌ఎంసీఆర్ ఎంపీ) నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. వైద్య వర్గాలపై దాడులను నిరోధించడమే లక్ష్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ నిబంధనలను గతంలోనే ప్రతిపాదించారు. అయితే జాతీయ వైద్య మండలి ఆ నిబంధనలను తాజాగా తెలిపింది.
ఆస్పత్రుల్లో కొన్నిసార్లు రోగి-వైద్యుడు, వైద్య సిబ్బంది, రోగి బంధువులు- ఆసుపత్రి వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో ఆస్పత్రిపై దాడి, వైద్య సిబ్బందితో దురుసుగా వ్యవహరించిన ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో న్యాయం ఎటువైపు ఉందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన సమయాల్లో విచక్షణ కోల్పోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
ఇలాంటి వాటిని నివారించేందుకే జాతీయ వైద్య మండలి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స చేసేది లేదని చెప్పవచ్చు.
కాగా, ఇప్పటికే కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ పేరటి 2002లో తీసుకొచ్చిన నిబంధనలు ఉన్నాయి. వాటి స్థానంలోనే ఎన్ ఎంసీఆర్ ఎంపీని ప్రవేశపెట్టనున్నారు. అయితే, వైద్యం అందిస్తున్న క్రమంలో రోగి లేదా వారి బంధువులు దురుసుగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే దాని గురించి రికార్డులో రాసి, మిగతా చికిత్స వేరేచోట చేయించుకునేలా వైద్యులు చెప్పవచ్చు.
రోగికి అందించే వైద్యం, ఫీజు వివరాలను వైద్యుడు రోగికి చెప్పాలి. చికిత్సకు ముందే రోగికి కన్సల్టేషన్ / చికిత్స ఫీజు గురించి తప్పక చెప్పాలి. అయితే, ఆ ప్రకారం ఫీజు చెల్లించకుంటే వైద్యుడు చికిత్స నిరాకరించొచ్చు. అత్యవసర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదు.
More Stories
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం
ఛత్తీస్గడ్లో మరో నలుగురు మావోలు మృతి