ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య

మధుమేహం, గుండె జబ్బులనేవి మాత్రమే కాకుండా భారతీయులను వెంటాడుతున్న మరో ప్రధాన ఆరోగ్య సమస్యల మన దేశంలోని ప్రతి ముగ్గురులో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని ఢిల్లీలోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైనెస్స్ (ఇఎల్బీఎస్) డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సెరిన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సరిన్ ఫ్యాటీ లివర్ సమస్య గురించి కీలక విషయాలను వెల్లడించారు. 
 
సరైన ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్‌ మానేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేసుకోవచ్చని సరిన్ తెలిపారు. ఆరోగ్యవంతమైన కాలేయంలోనూ కొవ్వు ఉంటుంది. కానీ ఆ అవయవం బరువులో కొవ్వు శాతం 5 శాతం వరకే ఉండాలి. ఒకవేళ లివర్‌ బరువులో ఫ్యాట్ 10 శాతానికి చేరితే సమస్య మొదలవుతుంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో (పెద్ద వయస్కుల్లో) ఒకరికి లివర్ ఫ్యాట్ అధికంగా ఉందని సరిన్ తెలిపారు. 

ఫ్యాటీ లివర్‌ను త్వరగా గుర్తించి చికిత్స అందిస్ చాలా వరకు సమస్యలను అడ్డుకోవచ్చని సరిన్ తెలిపారు. మన బరువులో పది శాతం తగ్గినా సరే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చని చెప్పారు. బరువు తగ్గితే కాలేయం కణజాలం మందంగా మారే ఫిబ్రోసిస్ సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. కానీ ఫ్యాటీ లివర్ సమస్య పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రధాన అవరోధంగా మారుతోందని చెప్పారు.

ఎయిమ్స్ తాజా అధ్యయనంలో భారతీయుల్లో మూడొంతుల మందికిపైగా (38 శాతం) ఫ్యాటీ లివర్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం కాలేదని, 35 శాతం మంది చిన్నారులు సైతం ఈ సమస్య బారిన పడ్డారని తెలిపింది. గత ఏడాది జూన్‌లో ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ హెపటాలజీ’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ వచ్చిన వారిలో తొలి నాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ముదిరాక లక్షణాలు బయటకొస్తాయి. ఆహారశైలి మారడ, ఫాస్ట్ ఫుడ్ తినడం, తాజా పండ్లు కూరగాయలు తగినంత తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి కారణంగా ఈ సమస్య పెరుగుతోందని డాక్టర్ అనూప్ శరణ్య తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడం, జంక్ ఫుడ్, తీపి పదార్థాలను నియంత్రించుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఈ వ్యాధి బారిన పడొచ్చని డాక్టర్ శరణ్య చెప్పారు. మన దేశంలో చాలా మందిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తోందని నిపుణులు చెబుతున్నారు.