
గోదావరికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఫలితంగా భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నాటికి నీటిమట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉంది. కలెక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు ఇప్పటికే 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు.
వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. వరదల పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ & ఔట్ ఫ్లో13లక్షల క్యూసెక్కులుగా ఉంది.
వరద శనివారం కూడా పెరిగి ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. సహాయక చర్యల్లో4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు పేర్కొంది. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గింది.
శుక్రవారం సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టడంతో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అనుమతించారు. మొదట హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను అనుమతించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరం వద్ద వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమైనట్లు టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.
హైదరాబాద్- విజయవాడ మార్గంలో సర్వీసులను టీఎస్ ఆర్టీసీ పునరుద్ధరించినట్లు పేర్కొంది. రెగ్యూలర్ సర్వీస్‌లు ప్రస్తుతం యథావిధిగా నడుస్తున్నట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించింది.
More Stories
ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం