పాక్ ఇస్లామియా యూనివర్సిటీలో డ్రగ్స్, సెక్స్ కుంభకోణం

పాకిస్థాన్‌లోని బ‌హ‌వ‌ల్‌పుర్ ఇస్లామియా యూనివ‌ర్సిటీలో  దారుణ‌మై నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ వ‌ర్సిటీలో డ్ర‌గ్స్‌, సెక్స్ కుంభ‌కోణం చోటుచేసుకున్న‌ట్లు తేలింది. వ‌ర్సిటీ విద్యార్థుల‌కు చెందిన సుమారు అయిదు వేల ఫోర్న్ వీడియోలు కూడా ల‌భ్యం అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌తో ఆ దేశంలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. 
డ్ర‌గ్స్‌కు బానిసైన మ‌హిళా విద్యార్థినుల‌కు చెందిన వీడియోలు క‌ల‌వ‌రం సృష్టిస్తున్నాయి. వ‌ర్సిటీకి చెందిన సిబ్బంది నుంచి పోలీసులు ఆ వీడియోల‌ను సీజ్ చేశారు. నిజానికి బ‌హ‌వ‌ల్‌పుర్ వ‌ర్సిటీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. తాజా ఘ‌ట‌న‌తో ఆ వ‌ర్సిటీపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.  ఈ ఎపిసోడ్‌లో కేంద్ర మంత్రి చౌద‌రీ తారిక్ బాషిర్ చీమా కుమారుడు మాస్ట‌ర్‌మైండ్‌గా ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు.
అత‌ను డ్ర‌గ్స్ దందాకు పాల్ప‌డుతున్న‌ట్లు తేలింది. ఆ డ్ర‌గ్స్ వ‌ల్లే వంద‌ల సంఖ్య‌లో ఇస్లామియా యూనివ‌ర్సిటీలో చదువుకుంటున్న మ‌హిళా విద్యార్థులు సెక్స్ ఊబిలోకి దిగుతున్న‌ట్లు భావిస్తున్నారు. టాప్ సెక్యూర్టీ అధికారి మేజ‌ర్ ఇజాజ్ షా వ‌ద్ద అప్రోడిసియాక్ పిల్స్‌తో పాటు డ్ర‌గ్స్ కూడా ల‌భించాయి. అతని మొబైల్ ఫోన్ లో 5000కు పైగా ఐయూబీ విద్యార్ధులు, ఉద్యోగుల అశ్లీల వీడియో రికార్డింగ్స్ కూడా ల‌భించాయి.
మంత్రి చీమా త‌న కుమారుడిని ర‌క్షించుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలుస్తోంది.  మంత్రి తన కుమారుడిని తప్పించడం కోసం పోలీసులపై వత్తిడి తెచ్చి మేజర్ ఇజాజ్ షాను అరెస్ట్ చేయించారని, మొత్తం నేరం అతనిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే పోలిసుల విచారణలో అతను పలు దిగ్బ్రాంతికార అంశాలు చెప్పిన్నట్లు తెలుస్తున్నది.

ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపడంతో సమగ్ర దర్యాప్తు కోసం పంజాబ్ పోలీసులు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.  స్వాధీనం చేసుకున్న వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.