భారత్ వ్యూహాత్మక ప్రతిఘటనకు ప్రతీక కార్గిల్

* కార్గిల్ విజయ్ దివాస్

సరిగ్గా 24 ఏళ్ళ క్రితం 1999 నాటి కార్గిల్ యుద్ధంలో పోరాడిన మన సైనికుల పరాక్రమం, త్యాగాలను స్మరించుకోవడానికి ప్రతి జులై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో ఇప్పుడు లడఖ్‌లో ఉన్న భారత సైనికులు యుద్ధం చేశారు. పాకిస్తాన్ వైపు నుండి ఎల్‌ఓసి (నియంత్రణ రేఖ) దాటి చొరబాటుదారులు చలికాలంలో భారత భూభాగంలోని ఖాళీ పోస్టులను ఆక్రమించారు.

పాకిస్తానీ చొరబాటుదారుల ప్రధాన లక్ష్యాలలో ఒకటి సియాచిన్‌లోని భారత దళాలకు ప్రధాన సరఫరా మార్గం శ్రీనగర్‌ను లేహ్‌ను కలిపే రహదారి ఎన్ హెచ్-ఎ1ని స్వాధీనం చేసుకోవడం. కార్గిల్ ద్వారా, పాకిస్తాన్ 1990 చివరలో తగ్గుముఖం పట్టిన కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించాలని కూడా కోరుకుంది.

కార్గిల్ ఉదంతం మన దేశపు ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో భారత దళాలు చూపిన అపారమైన త్యాగం, మరియు ధైర్యసాహసాల కథ. జూలై 26, 1999న కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. చొరబడిన పాకిస్తానీ దళాలన్నింటిని భారత భూభాగం నుండి వెనక్కి నెట్టడం జరిగింది.

కార్గిల్ విజయ్ దివస్ భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలలో యుద్ధం ఎలా ఒక మైలురాయి సంఘటనగా తిరిగి చూసుకునే అవకాశాన్ని అందిస్తుంది. మొదటిగా, కార్గిల్ దక్షిణాసియాలో శాస్త్రీయ అణు నిరోధక సిద్ధాంతపు  తర్కాన్ని సవాలు చేసింది; రెండవది, ఇది అణ్వాయుధాలు, అమెరికా దౌత్యపు ఉనికినితో భారతదేశపు వ్యూహాత్మక నిగ్రహంకు గుర్తింపు లభించింది; మూడవది, కార్గిల్ యుద్ధం ప్రజాస్వామ్య శాంతి సిద్ధాంతపు  నమూనాలను కూడా సవాలు చేసింది; నాల్గవది, భారతదేశంపై ప్రయోజనం పొందేందుకు పాకిస్తాన్ మోసపూరిత వ్యూహాలను వెల్లడి చేసింది. 

 మే, 1998లో తమ అణ్వాయుధాలను పరీక్షించడం ద్వారా భారత్, పాకిస్తన – రెండూ  బహిరంగ అణ్వాయుధ శక్తులుగా మారాయి.  అణ్వాయుధాల ఉనికి రెండు దేశాలు తమ రాజకీయ లక్ష్యాలను సాధించడానికి యుద్ధాన్ని నివారిస్తుందని భావించాము. గతంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అణు ప్రతిఘటన వాటి మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఎక్కువగా దోహదపడింది.

1999 ఫిబ్రవరిలో ప్రధాని వాజ్‌పేయి లాహోర్‌ను సందర్శించి, అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రసిద్ధ లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో ఇటువంటి దృక్కోణం అవకాశాలు ఊపందుకున్నాయి. ఇందులో అనేక అణు, అణుయేతర విశ్వాస నిర్మాణ చర్యలు ఉన్నాయి.

అయితే ఆ ప్రకటనపై సంతకాలు ఇంకా ఆరకముందే, 1999 వసంతకాలంలో పాకిస్తాన్ కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు, అణు నిరోధక ప్రతిపాదకులకు ఇది ఆశ్చర్యం కలిగించింది. ప్రచ్ఛన్న యుద్ధ యుగంలో అభివృద్ధి చెందిన న్యూక్లియర్ డిటరెన్స్ సిద్ధాంతం దక్షిణాసియాలోని భద్రతా దుస్థితిని వివరించడానికి సరిపోదని స్పష్టమైంది.

కార్గిల్ 1998లో అణ్వాయుధాలను బహిరంగంగా కొనుగోలు చేసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ సంబంధాల గందరగోళ చరిత్రకు నాంది పలికింది, ఇది ప్రచ్ఛన్న యుద్ధ అనుభవం ఆధారంగా అణు నిరోధంపై క్లాసిక్ సిద్ధాంతాన్ని సవాలు చేసింది. పాకిస్తాన్‌కు, అణ్వాయుధాలు సమాన హోదా కల్పించేందుకే పనిచేశాయి.

కాశ్మీర్‌లో పాక్ దురాక్రమణకు ప్రతీకారం తీర్చుకోకుండా భారత్‌ను అడ్డుకునే కవచంలా ఇది పనిచేసింది. స్థిరత్వం-అస్థిరత వైరుధ్యంల తర్కం అణు వాతావరణంలో భారతదేశం- పాకిస్తాన్ సంబంధాల సంక్షోభానికి దారితీసే స్వభావాన్ని వివరించగలిగింది.

భారతదేశపు వ్యూహాత్మక నియంత్రణ భారతీయ ప్రతిస్పందనపై ప్రభావం చూపింది. ఇది భారత భూభాగంలో వారు ఆక్రమించిన స్థానాల నుండి చొరబాటుదారులను బయటకు పంపడానికి భూ బలగాలతో పాటు వైమానిక బలగాలను కూడా ఉపయోగించింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్ తన వైమానిక దళాన్ని ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి.

పాకిస్తాన్‌తో గతంలో జరిగిన యుద్ధాల్లో భారతదేశం అనుసరించిన వైఖరికి ఇటువంటి వైఖరి చాలా భిన్నమైనది. 1965, 1971 యుద్ధంలలో భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఘర్షణలకు పాల్పడ్డాయి. కానీ ఈ సారి

భారతదేశపు వ్యూహాత్మక సంయమనం వెనుక కారణం పాకిస్తాన్ ఆయుధశాలలో అణ్వాయుధాలు ఉండటం, వాటి గురించిన ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో భారత్ నియంత్రణ రేఖకు ఇవతలి తన   ప్రతిస్పందనను పరిమితం చేసింది. దాని కారణంగానే జులై, 1999లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని వాషింగ్టన్‌లో కలిసిన తర్వాత నవాజ్ షరీఫ్ చివరకు భారత భూభాగం నుండి దళాలను ఉపసంహరించుకోవాలని ఏకపక్షంగా ఆదేశింపాల్సి వచ్చింది.

 లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేస్తున్నప్పుడే కార్గిల్ ఆపరేషన్ ప్రణాళిక ప్రారంభమైంది. కార్గిల్ అప్పటి ఆర్మీ స్టాఫ్ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ ఆలోచన. ఐఎస్ఐ తో పాటు మరొకొందరు అధికారులతో కలిసి ఈ పథకంకు రచన చేసాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చొరబాట్లను అసలు  ఊహించని భూభాగాన్ని రక్షించడంలో భారత బలగాలు ఆశ్చర్యానికి గురవుతాయని వారు భావించారు.

చొరబాటుదారులు నార్తర్న్ లైట్ పదాతి దళానికి చెందిన సాధారణ బలగాలు అని గుర్తించడానికి భారత సైన్యానికి ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టడంతో వారి వ్యూహాత్మక ఎత్తుగడ వెల్లడైంది. తమ సైనిక చర్యగా కాకుండా కాశ్మీర్ లో తిరుగుబాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

అయితే భారత్ వ్యూహాత్మకంగా స్థిరమైన విధానంతో అడుగులు వేయడం ద్వారా వారి ఎత్తుగడలను చిత్తు చేయగలిగింది. అప్పటి నుండి తిరిగి భారత్ వైపు సైనిక చర్యకు సాహసింపలేని విధంగా దెబ్బ తీయగలిగింది. రెండు దేశాలు అణుసామర్థ్యం గలవైనప్పటికీ అంతర్జాతీయ సరిహద్దులను దాటకుండానే పాకిస్థాన్ ను ధీటుగా తిప్పిగొట్టగలమని ప్రపంచానికి తెలియచెప్పగలిగాము.

 .