ఇక అంతరిక్షంలో ఎక్కడికైనా ప్రయోగాలు చేయగల ఇస్రో

చంద్రయాన్ -3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలగడంతో ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఇప్పుడు మరో ముందడుగు వేయనున్నాయి. ఇప్పటి వరకు నిర్ణీత కక్ష్యలో మాత్రమే ప్రయోగాలు చేయగల సామర్ధ్యం గల ఇస్రో, ఇప్పుడు ఎక్కడికైనా, ఎటువైపైనా ప్రయోగాలు చేయగల సామర్ధ్యం సొంతం చేసుకుంది. అంతుకు అవసరమైన ప్రయోగ వాహనం (లంచ్ వెహికల్) సిద్దమైనట్లయింది.
ఈ లాంచ్ వేహికల్కి ఎల్వీఎం మార్క్–3గా పేరు పెట్టారు. దీనికి  స్థిరమైన కక్ష్య అంటూ లేదు. జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ),  మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ఎక్కడికైనా దీన్ని ప్రయోగించవచ్చు. లాంచ్ వెహికల్స్ అంటే అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే వాహనాలు.  వీటిని అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. 

భారతదేశంలో మూడు క్రియాశీల కార్యాచరణ ప్రయోగ వాహనాలున్నాయి. అందులో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్ వి),  జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్ఎల్ వి),  జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-III ( ఎల్వీఎం3) కీలకమైనవి.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధానంగా ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లోకి చేర్చే పనిని కోసం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్ఎల్ వి ) మార్క్ -IIIని లాంచ్ వెహికల్ మార్క్-IIIగా మార్చింది.  ఎల్వీఎం -3 రాకెట్ 2024 చివరిలో తాత్కాలికంగా షెడ్యూల్ చేసిన భారతదేశపు తొలి మానవ అంతరిక్ష విమానానికి కూడా ఉపయోగించబడుతుంది. 

ఈ మధ్యకాలంలో 36 వన్ వెబ్  ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో చేర్చిన తర్వాత ఇస్రో తన వాణిజ్య ప్రయోగాలలో దీన్ని ఎక్కువగా ఇష్టమైనదిగా చెప్పుకుంటోంది.   ఇంతకుముందు లాంచ్ వెహికల్స్ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉండేవి. అందుకని వాటికి ప్రత్యేకంగా పేర్లు పెట్టారు. ఉదాహరణకు ధ్రువ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచడానికి  పీఎస్ఎల్ వి, భూస్థిర ఉపగ్రహాల కోసం జిఎస్ఎల్ వి గా పిలుచుకునేవారు. అంతరిక్ష ప్రయోగానికి సంబంధించి కక్ష్యల రకానికి సంబంధించిన గందరగోళాన్ని తొలగించేందుకు ఇస్రో ఈసారి రాకెట్ పేరు మార్చేసింది.

ఒక  జిఎస్ఎల్ వి – జీఈఓ కక్ష్య కోసం అదే పేరుతో పిలవబడుతూనే ఉంటుంది. కానీ  జిఎస్ఎల్ వి -మార్క్ III పేరును  ఎల్వీఎం 3గా మార్చేశారు. ఎల్వీఎం 3 ప్రతిచోటకు వెళ్తుంది. జీఈఓ, ఎంఈఓ, ఎల్ఈఓ చంద్రుడిపైకి, సూర్యునిపైకి తదుపరి మిషన్లను కూడా ఈ శాటిలైట్ తీసుకెళ్లగలదు.   జిఎస్ఎల్ వి మార్క్-III ,  ఎల్వీఎం 3 2019లో చంద్రునిపైకి చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించడానికి ఉపయోగించబడింది.  ఇది రాకెట్ యొక్క మొదటి కార్యాచరణ విమానం. 

పీఎస్ఎల్ వి  6,4,2 సాలిడ్ రాకెట్ స్ట్రాప్-ఆన్ మోటార్లు & కోర్ అలోన్ వెర్షన్లు వంటి నాలుగు వేరియంట్‌లతో కాన్ఫిగర్ చేసి ఉంటుంది. పేలోడ్ బరువులు, సాధించాల్సిన కక్ష్య ఆధారంగా వేరియంట్‌లను ఎంపిక చేస్తారు.  పీఎస్ఎల్ వి అనేది మూడు రకాల పేలోడ్‌లను ప్రయోగించడానికి మోహరించిన బహుముఖ ప్రయోగ వాహనం. 

భూమి పరిశీలన, జియో-స్టేషనరీ, నావిగేషన్. పీఎస్ఎల్వీ ప్రయోగంలో అత్యధిక సక్సెస్ రేటును ఉంది. ఇది ఇస్రో విజయవంతమైన శాటిలైట్గా పేరు పొందింది. ఇక.. స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌తో కూడిన జిఎస్ఎల్ వి 2 టన్నుల క్లాస్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలు ఉంటుంది.

ఎల్వీఎం 3 అనేది నెక్ట్స్ లెవల్ ప్రయోగ వాహనం.  ఇది 4 టన్నుల కమ్యూనికేషన్ ఉపగ్రహాలను, 10 టన్నుల తరగతి పేలోడ్‌లను లో ఎర్త్ ఆర్బిట్(లియో)లకు ప్రయోగం చేయొచ్చు. సి25 క్రయో స్టేజ్‌తో సహా పూర్తిగా స్వదేశీ సాంకేతికతలతో వాహనం అభివృద్ధి చేశారు. లాంచ్ వెహికల్ మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ నుండి కూడా అన్ని విజయవంతమైన ప్రయోగాల ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉంది.

 హ్యూమన్ రేట్   ఎల్వీఎం 3 గగన్యాన్ మిషన్ కోసం ప్రయోగ వాహనంగా గుర్తించారు. దీనికి హెచ్ ఆర్ ఎల్ వి అని పేరు పెట్టారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ ఎస్ ఎల్ వి) అనేది డిమాండ్ ఆధారిత ప్రాతిపదికన చిన్న శాటిలైట్ లంచ్ మార్కెట్‌కు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతికతలతో అభివృద్ధి చేయబడుతోంది.

ఇస్రో లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ అనేది అనేక సెంటర్లలో విస్తరించి ఉంది. తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో లాంచ్ వెహికల్స్ రూపకల్పన.. అభివృద్ధి వంటివి జరుగుతాయి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వంటివి మహేంద్రగిరిలో ఉన్నాయి. ఈ ప్రయోగ వాహనాల కోసం ధ్రువ, క్రయోజెనిక్ దశలను అభివృద్ధి చేస్తారు. 

ఇక.. నెల్లూరు (ప్రస్తుతం తిరుపతి) జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ లో భారతదేశంలోని అంతరిక్ష నౌకాశ్రయం, లాంచర్‌ల వంటివి ఉంటాయి. ఇక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగ వాహనాలను ప్రయోగించడానికి రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి.