శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌ రావు కన్నుమూత

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) (75) గురువారం కన్నుమూశార హైద‌రాబాద్ లోని ఆయ‌న నివాసంలో ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో నేటి ఉద‌యం జారిపడ్డారు.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు చికిత్స్ కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించిన బీఎస్ రావు గత 40 ఏళ్లుగా విజయవంతంగా నడుపుతున్నారు.  బీఎస్ రావు తొలినాళ్లలో యూకే, ఇరాన్ లో డాక్టర్ గా పని చేశారు. అనంతరం భార్యతో కలిసి విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూపోయారు.

 ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీరి కాలేజీలు ఉన్నాయి. మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఎంసెట్, నీట్ వంటి పరీక్షల్లో శ్రీ చైతన్య తన మార్క్ ను చూపించింది. అగ్రస్థానంలో నిలిస్తూ విద్యావ్యవస్థలో సరికొత్త చరిత్రను సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటం అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థల తన ప్రత్యేకతగా నిలుపుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుంచి చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యావ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. 

పదవ తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లటం అనేది విద్యార్థి దశలో కీలక మలుపు. అందుకే ఈ మలుపునే ఆయన వ్యాపార విస్తరణకు అవకాశంగా మలుచుకున్నారు. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటి-జెఇఇ, ఎఐఇఇఇ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. శ్రీ చైతన్య ఐఏస్ అకాడెమీలను కూడా నిర్వహిస్తున్నారు.