ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలో పలు చోట్ల పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారు. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లు, 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉంది. గతంలో వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్ లో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉంది.
ఈ కేసులలో మొత్తం 11మందిని నిందితులుగా జాతీయ దర్యాప్తు సంస్థ చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది. జూలై 7వ తేదీన ఈ నలుగురు నిందితులను దోషులుగా తీర్చిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం నాడు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

More Stories
బెంగాల్ లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పుల కలకలం
పుణే బాలిక అత్యాచారం, హత్య నిందితులకు మరణశిక్ష: ఫడ్నవిస్
జబల్పూర్ బోటు ప్రమాదంలో మొత్తం 13 మృతదేహాలను వెలికితీత