భారత్ లోని సాధారణ ప్రజలతో పోల్చుకుంటే కారాగారాల్లో మగ్గిపోతున్న ఖైదీల్లో ఐదు రెట్లు ఎక్కువగా క్షయవ్యాధి వ్యాపించి ఉన్నట్టు లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రపంచ స్థాయి అధ్యయనాన్ని వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు మొత్తం 195 దేశాల్లో సాగిన ఈ అధ్యయనంలో 193 దేశాల నుంచి డేటా విశ్లేషించ గలిగారు.
జర్నల్ జులై ఎడిషన్‌లో ఈ అధ్యయనం వెల్లడైంది. దేశంలోని జైళ్లలో గల ఖైదీల్లో ప్రతి లక్ష మందిలో 1076 మందికి క్షయ వ్యాధి ఉన్నట్లు తేలింది. 2021లో లక్ష మందికి 210 కేసులు బయటపడ్డాయని గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ స్థాయి క్షయవ్యాధి నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచ స్థాయిలో సాధారణ జనం కన్నా జైళ్లలోని ఖైదీల్లో క్షయవ్యాధి పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.
2019లో ప్రపంచం మొత్తం మీద 2019లో జైళ్లలోని ఖైదీల్లో 11 మిలియన్ మందికి 125,105 (1.2 లక్షల మంది) మంది క్షయతో బాధపడుతున్నట్లు బయటపడింది. ఏడాదికి లక్ష మందిలో 1,148 కేసుల వంతున క్షయ రేటు పెరుగుతుంది. ఏదెలాగున్నా క్షయవ్యాధిని గుర్తించడం చాలా తక్కువగా జరుగుతోందని, జైళ్లలోని టిబి కేసుల్లో కేవలం 53 శాతమే గుర్తించడమౌతోందని నివేదిక వెల్లడించింది.
జైళ్లలో కిక్కిరిసి ఉన్న ఖైదీలకు దేశ స్థాయిలో పెరుగుతున్న కేసులకు సంబంధం ఉంటోందని, అందువల్ల ఖైదీల సంఖ్య పరిమితం చేయవలసి ఉందని అధ్యయనం నిర్వాహకులు బోస్టన్ యూనివర్శిటీకి చెందిన లియోనార్డో మార్టినెజ్ ప్రకటనలో పేర్కొన్నారు
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం