తిమ్మాపూర్ లో లేని కుల వివక్షతతో చిచ్చు రేపుతున్న వామపక్షాలు 

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, మర్కుక్ మండలం దగ్గరలో వున్న తిమ్మాపురం గ్రామంలో దళితుల పట్ల  కుల వివక్షత, అంటరానితనం పాటిస్తున్నారంటూ కుల నిర్ములన పెడుతూ ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్ లకు చెందిన వామపక్ష  నేతలు నానా హంగామా చేస్తున్న ప్రకటనలు నిజమేనని భ్రమింపచేస్తున్నాయి. 
 
వారం రోజులుగా దళిత సంఘాల నాయకులమని చెప్పుకునే సెటిల్మెంట్ వ్యక్తులు రోజు ఒకరు చొప్పున తిమ్మాపురం రావటం సభలు పెట్టి, ఇతర కులాలను తిట్టటం, పోలీస్ స్టేషన్ లో హడావిడి చేసి, వాళ్ళు ఫిర్యాదు చేసిన ఇతర కులాల వ్యక్తులను ఎస్ సి అట్రాసిటీ కేసు క్రింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం, మరోవైపు పిర్యాదులో పేర్లున్న వారి నుండి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి.
 
ఆ గ్రామం సందర్శించిన ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ వేదిక నాయకుల కధనం మేరకు  తిమ్మాపురం గ్రామంలో రజక, యాదవ, ముదిరాజ్, పద్మశాలి మొదలైన బిసి కులాలతో పాటు, ఎస్ సి మాదిగలు అన్యోన్యంగా, సామరస్యంగా ఎప్పటినుండో జీవిస్తూ వస్తున్నారు. బిసి కులాల పొలాల్లో పని చేస్తూ, వారి ఇళ్లల్లో భోజనాలు కూడా ఎస్ సి మాదిగలు చేస్తూ వున్నారు. 
 
అలాగే ఎక్కడ ఏ ఊర్లోనైనా భజనలు చేస్తే బిసి ఎస్ సి కులాల వారు కలిసి భజన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాల్లో ఎస్ సి లతో సహా అందరికి ప్రవేశం వుంది. అయితే లేని వివక్షతను సృష్టించే ప్రయత్నంలో ఎస్ఎఫ్ఐ,  కుల నిర్ములన సమితి కి చెందిన నాయకులు ఒకరిద్దరు గ్రామంలో వున్న ఈ సామరస్యాన్ని చెడగొట్టి, సొమ్ము చేసుకునేందుకు స్కెచ్ గీసి కలహాలు సృష్టించే పనులు చేస్తున్నారు.
 
1. సామూహికంగా 30 మంది ఎస్ఎఫ్ఐ నాయకుని ఆధ్వర్యంలో హనుమాన్ గుడి లోపలికి వెళ్లి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, కేసులు పెట్టొచ్చని ప్రయత్నం చేశారు. ఎప్పుడూ ఇంతమంది ఒకేసారి గుడికి రావటం ఏమిటాని బిసిలకు ఆశ్చర్యం కలిగించింది.
 
2. ప్రక్క గ్రామమైన తిగుల్ నుండి నాయి బ్రాహ్మణులు వచ్చి ఒక బి సికి క్షవరం చేస్తుంటే, 25 మంది ఎస్ఎఫ్ఐ నాయకుని నాయకత్వంలో వచ్చి, తమకు తొందరగా క్షవరం చేయమని ఒత్తిడి తేవటంతో, ఆ మంగలి ఒకేసారి మీద పడితే ఎట్లా, ఒకరి తర్వాత ఒకరికి చేస్తా అనటంతో, ఎస్ సిల పట్ల వివక్షత పాటిస్తున్నాడని, బిసి లకు కుర్చీలో, ఎస్ సి లకు క్రింద కూర్చోపెట్టి క్షవరం చేస్తున్నాడని గొడవ చేశారు.
 
3. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు 25- 30 మంది ఒక్కసారే వచ్చి, తామే (ఎస్ సిలు) వడ్డన చేస్తామని, బి సి లు తినాలని ఒత్తిడి తేవటంతో బిసిలు ఈ పరిణామానికి విస్మయం చెందారు. ఒక బి సి కులానికి చెందిన 80 ఏళ్ల ముసలి తల్లి, ఎస్ సిలు బలవంతం చేస్తూ వడ్డించటం ఏమిటని ప్రశ్నించగానే వివక్షత చూపించారంటు గొడవ చేసి 10 మంది మీద ఒక్కొక్క కులం నుండి ఏరి అట్రాసిటీ కేసులు పెట్టారు.
 
ఈ వివరాలు నిజమేనని ఎస్ సి లలో వున్న పెద్ద మనుషులు, నిజాయితీ వ్యక్తులు కూడా చెబుతున్నారు. ఎస్ సిలలో వున్న పెద్ద మనుషుల, నిజాయితీ పరుల నోరు నొక్కేసారు. అంతేకాకుండా ఎస్ సిలు ఎవరైనా బిసిల ఇంటికి వెళ్లినా, పనులు చేసినా, భోజనాలు చేసినా  రూ. 15,000 కులం కట్టు క్రింద దండుగ ప్రకటించారు
 
5. ఈ ఎస్ఎఫ్ఐ నాయకుడు, కుల నిర్ములన సమితి నాయకుడు.. ఈ ఇద్దరు కమ్యూనిస్ట్ లు చేస్తున్న నాటకంలో, గీస్తున్న స్కెచ్ లో ఎస్ సిలు బలి పశువులు అవుతున్నారు. ఎస్ సి అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుండి, ఇటు బి సి ల నుండి డబ్బులు రాబట్టి పంచుకుంటున్నారు. 
అందరి వాడైన అంబేద్కర్ పేరుతో గ్రామాల్లో చిచ్చు పెట్టే ఈ కమ్యూనిస్ట్ ల నుండి దూరం ఉండాలని అంబేద్కర్ బ్రతికి ఉన్నప్పుడే చెప్పారు.  ఇప్పటికైనా నిజం తెలుసుకుని, మా కులపోడే కదా అని, ఈ చదువుకున్న కమ్యూనిస్టు మూర్ఖుల చేతిలో పడి వంచనకు గురి కావొద్దు. ఊర్లో వున్న మంచి వాతావరణం చెడగొట్టవద్దని సామాజిక సమరసతా వేదిక హితవు చెప్పింది.

భారత రాజ్యాంగం పీఠికలో డా బి ఆర్ అంబేద్కర్ పేర్కొన్నట్లుగా సమాజంలో ప్రజలు సోదర భావంతో వుంటూ స్వేచ్చ, సమానత్వ దిశలో పయనించాలన్న సంకల్పానికి, గండి కొడ్తున్న కమ్యూనిస్ట్ ల నుండి గ్రామాలను రక్షించుకోవాలని ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ వేదిక విజ్ఞప్తి చేసింది.