
రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్‌కి అన్ని విధాలా సహకారమందిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమెరికా ఈ ఏడాది కాలంలో ఉక్రెయిన్‌కి మూడుసార్లు ప్యాకేజీ అందజేసింది. తాజాగా నాలుగో ప్యాకేజీని కూడా అందించనుంది.
తాజాగా ఉక్రెయిన్‌కి అందించే ఆయుధాలలో ఒకేసారి వందల సంఖ్యలో బాంబులు, కస్లర్ బాంబు ఆయుధాలను అందించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్లస్టర్ బాంబు ఆయుధాలను వందకు పైగా దేశాలు నిషేధించాయి. ఇలాంటి నిషేధిత అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కి అందజేయనున్నట్లు ముగ్గురు అమెరికా అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
155 మిల్లీమీటర్ల హోవిట్జర్ ఫిరంగి నుండి క్లస్టర్ ఆయుధాలతో సహా ఉక్రెయిన్‌కి తాజా ప్యాకేజీని ప్రకటించాలని భావిస్తున్నట్లు ఆ అధికారులు తెలిపారు. కాగా, క్లస్టర్ బాంబులు విస్తారమైన ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో చిన్న బాంబులను విడుదల చేస్తాయి. ఇవి యుద్ధ సమయంలోనే కాక.. యుద్దానంతరం కూడా పౌరులకు పెద్ద ముప్పును కలిగిస్తాయి.
ఎందుకంటే కస్టర్ విడుదల చేసిన బాంబుల్లో కొన్ని ఆ సమయంలో పేలవు. ఆ తర్వాత పేలి పౌరులకు ముప్పు కలిగించే ప్రమాదం వుంది. అందుకే ఈ ఆయుధాలను నిషేధిస్తూ.. 2008లో 120 దేశాలు సంతకం చేశాయి. అయితే ఈ దేశాల జాబితాలో అమెరికా చేరకపోవడం గమనార్హం.
More Stories
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్